ఇండస్ట్రీలో హీరోలు అవుదామని వచ్చేవారిలో చాలామంది మాస్ ఇమేజ్ కోసమే పాకులాడుతారు. సాఫ్ట్ లుక్.. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న యంగ్ హీరోలు సైతం బీభత్సమైన ఫైట్లు అవీ చేసేసి మాస్ హీరో అయిపోవాలని తెగ ఆరాటపడిపోతుంటారు. అందుకోసమే రొటీన్ స్టోరీలతోనే సినిమాలు చేసి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. కొంతమందికి రెండు.. మూడు సినిమాలకే ఈ మాస్ ఇమేజ్ వస్తే.. ఇంకొందరికి పది సినిమాలు చేసినా అందని ద్రాక్షగానే ఉండిపోతుంది.
కమెడియన్లుగా బ్రహ్మాండంగా రాణించిన యాక్టర్లు కూడా హీరోల అవతారం ఎత్తాక మాస్ ఇమేజ్ కోసమే ఆరాట పడిపోతున్నాడు. రీసెంట్ గా జబర్దస్త్ తో మంచి పేరు తెచ్చుకున్న షకలక శంకర్ హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నాడు. శంభో శంకర పేరుతో వస్తున్న ఈ సినిమాలో శంకర్ ఫుల్ మాస్ అప్పీల్ తో తెరపై కనిపించేందుకు ఆరాట పడిపోతున్నాడు. కమెడియన్ గా తన బ్రాండ్ నేమ్ అయిన షకలక కూడా ఈ సినిమా టైటిల్స్ నుంచి తీసేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తూ పోస్టర్లలో హీరోయిజం చూపిస్తున్నాడు.
హీరోగా ఒకటి.. రెండు సినిమాలు చేశాక ఇలాంటిదేదో ట్రై చేస్తే కొత్తగా అనిపించేదేమో మరీ మొదటి సినిమాకే శంకర్ చేస్తున్న సాహసాలు చూస్తే వర్కవుట్ అవుతుందా అన్న డౌట్ వస్తోంది. ఇతడికన్నా ముందు హీరోలుగా మారిన కమెడియన్లు సునీల్.. సప్తగిరి కూడా ముందు కామెడీ సినిమాలతోనే ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్ ఇమేజ్ కోసం సునీల్ ప్రయత్నాలు చేసి వరసగా ఎదురుదెబ్బలు తింటే.. సప్తగిరి ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ తిప్పలు ఎందుకు అనుకున్నాడో ఏమో షకలక శంకర్ ఏకంగా ఊరమాస్ సినిమాతో రంగంలోకి దిగిపోతున్నాడు.