సుధీర్ వర్మ దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మాణంలో రూపొందుతున్న సినిమాకు శాకిని డాకిని అనే టైటిల్ ను ఖరారు చేసి అధికారికంగా టైటిల్ పోస్టర్ ను రివీల్ చేయడం జరిగింది. సురేష్ బాబు గురు పిక్చర్స్ వారితో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొరియన్ సూపర్ హిట్ థ్రిల్లర్ మిడ్ నైట్ రన్నర్స్ సినిమా కు రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ఇద్దరు అమ్మాయిల స్టోరీ ఇది. ఇందులో రెజీనా మరియు నివేదా లు నటించారు. సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతుంది. కిడ్నాప్ నేపథ్యంలో సాగే కథ మరియు స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
చాలా రోజులుగా ఈ సినిమా అదుగో ఇదుగో అంటూ వాయిదాలు పడుతూ వస్తోంది. కరోనా వల్ల చాలా ఆలస్యం అయిన ఈ సినిమా ను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు సుధీర్ వర్మ ఇతర ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టబోతున్న నేపథ్యంలో టైటిల్ ను ప్రకటించి మెల్లగా ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేయడం జరిగింది. దీంతో సినిమా గురించి జనాల్లో చర్చ మొదలు పెట్టారు. టైటిల్ ను అనౌన్స్ చేసిన వెంటనే బాబోయ్ ఇదేం టైటిల్ అన్నట్లుగా ప్రేక్షకులకు ఫీల్ కలుగుతుంది. ఆ వెంటనే భలే ఉందే.. సినిమా ఎలా ఉంటుందో అనే చర్చ కూడా మొదలు అవుతుంది. టైటిల్ క్యాచీగా ఇంట్రెస్టింగ్ గా ఉండటం వల్ల సినిమా పై జనాల్లో సహజంగానే అంచనాలు ఆసక్తి పెరగడం ఖాయం. ఇప్పుడు ఈ సినిమా కోసం కూడా జనాలు వెయిట్ చేస్తున్నారు.
ఇక దర్శకుడు సుధీర్ వర్మ ఒక వైపు సినిమా లను తెరకెక్కిస్తూనే మరో వైపు ఓటీటీ కంటెంట్ పై కూడా దృష్టి పెట్టాడు. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా అంటూ గత రెండు మూడు ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి. కాని కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు రవితేజ తో సినిమా చేసే అవకాశం ను ఈయన దక్కించుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. రవితేజ తో మాత్రమే కాకుండా నిఖిల్ తో కూడా ఈయన ఒక సినిమా ను చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రణరంగం వంటి ప్లాప్ తీసినా కూడా సుధీర్ వర్మ పై ఉన్న నమ్మకంతో హీరోలు వరుసగా ఆఫర్లు ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం.