ఇటీవలే ప్రాణాలు విడిచిన బాలీవుడ్ లెజెండరీ నటుడు ఖాదర్ ఖాన్ కు బాలీవుడ్ ఘన నివాళే అర్పించింది. ఆయన గురించి పలువురు ప్రముఖ తారలు గొప్పగా మాట్లాడారు. మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఆయన గురించి కథనాలు వచ్చాయి. ఐతే ఖాదర్ చనిపోయాక అందరూ గొప్పగానే నివాళి అర్పిస్తున్నారని.. ఆయన గురించి గొప్పగా మాట్లాడుతున్నారని.. కానీ ఖాదర్ బతికి ఉండగా దయనీయ స్థితిలో ఉంటే ఎవ్వరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఆయన మిత్రుడు శక్తి కపూర్. ఖాదర్ తో కలిసి అనేక సినిమాల్లో నటించిన శక్తి.. ఆయన మరణించాక చూపిస్తున్న అటెన్షన్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఖాదర్ విషయంలో బాలీవుడ్ వాళ్లు వ్యవహరించిన తీరును ఆయన దుయ్యబట్టారు.
‘ఖాదర్ ఖాన్ మరణం నన్నెంతో బాధించింది. నా కెరీర్ లో సగం చిత్రాలు ఖాదర్ ఖాన్ తోనే కలిసి నటించాను. మేమిద్దరం దాదాపు వంద చిత్రాల్లో నటించాం. ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి చిత్ర పరిశ్రమ ఖాదర్ ను గుర్తుచేసుకుంటోంది. కానీ బతికున్నప్పుడు వారి గురించి ఎందుకు ఆలోచించరు? పట్టించుకోరు. చనిపోయాకే ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఈ విషయం నన్నెంతో బాధించింది. సినిమా రంగానికి చెందిన నా స్నేహితులు కొందరు చనిపోయినప్పుడు మాత్రమే వారి గురించి గొప్పగా మాట్లాడారు. బతికున్నప్పుడు పట్టించుకోలేదు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఖాదర్ ఖాన్ గత పదేళ్లుగా సినిమాల్లో కనిపించకపోయేసరికి ఆయన్ను మరిచిపోయారు. కనీసం ఆయన గురించి అడిగినవారు కూడా లేరు. పదేళ్లు ఒంటరిగా జీవించారు. తననెవరూ పట్టించుకోకపోవడం గురించి ఆయన చాలా బాధ పడేవారు. ఖాదర్ వద్ద డబ్బు లేకపోలేదు. కానీ ఆయన ఒంటరిగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఎవ్వరూ వెళ్లి పలకరించింది లేదు. చిత్ర పరిశ్రమ ఒంటరివాడిని చేసేసింది. ఖాదర్ గురించి చెప్పాలంటే నేనో పుస్తకం రాయాలి. చివరగా ఆయన్ని కలిసినపుడు ఇప్పటి చిత్ర పరిశ్రమ తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నటీనటులకు కేవలం అందం.. గ్లామర్ ఉంటే సరిపోతుందని అనుకుంటున్నారని.. ఒక్కరూ సరిగా మాట్లాడట్లేదని.. తాను మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అందరికీ ఎలా మాట్లాడాలో నేర్పిస్తానని అన్నారు. కానీ ఇంతలోనే వెళ్లిపోయారు’ అంటూ శక్తి కపూర్ ఆవేదన వ్యక్తం చేశాడు.