మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కు ఇది అవ‌మానమే!

Update: 2022-08-10 11:54 GMT
బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన లేటెస్ట్ మూవీ `లాల్ సింగ్ చ‌డ్డా`. అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అమీర్ ఖాన్ ఆయ‌న మాజీ భార్య కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంథారే ల‌తో క‌లిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. 1994లో టామ్ హంక్స్ న‌టించిన హాలీవుడ్ మూవీ `ఫారెస్ట్ గంప్‌` ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేశారు. ఇందీ నేటివిటీకి అనుగుణంగా న‌టుడు అతుల్ కుల‌క‌ర్ణి మార్పులు చేశారు.

క‌రీనా క‌పూర్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీతో టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌చైత‌న్య బాలీవుడ్ ఇండస్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే. తెలుగులో ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండగా గీతా ఆర్ట్స్ విడుద‌ల చేస్తోంది. భారీ అంచ‌నాల మ‌ధ్య ఆగ‌స్టు 11న మ‌రి కొన్ని గంట‌ల్లో ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. హిందీతో పాటు ఈ మూవీని తెలుగు, తమిళ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఈ మూవీకి ఎక్క‌డా ఆశించిన స్థాయిలో బ‌జ్ క‌నిపించ‌డం లేదు. ఉభ‌య తెలుగు రాష్ట్రాతో పాటు బాలీవుడ్ లోనూ ఈ మూవీకి షాకింగ్ బుకింగ్స్ న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. బాలీవుడ్ లో పేరు మోసిన సూప‌ర్ స్టార్ అమీర్ ఖాన్ మూడేళ్ల విరామం త‌రువాత వ‌స్తున్న సినిమా అని తెలిసినా ఎవ‌రు అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ముందుకు రాక‌పోవ‌డం ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది. `థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్` అమీర్ కెరీర్ లో అత్యంత డిజాస్ట‌ర్ గా నిలిచింది.

ఈ మూవీ త‌రువాత దాదాపు మూడేళ్లు విరామం తీసుకున్నారు. ఇన్నేళ్ల త‌రువాత అమీర్ న‌టించిన సినిమాకు ఈ స్థాయిలో బుకింగ్స్ జ‌ర‌గ‌డం నిజంగా ఆయ‌నకు ల‌భించిన అవ‌మానంగా బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు అభివ‌ర్ణిస్తున్నాయి. నాగ‌చైత‌న్య ప‌రిచ‌యం అవుతున్న తోలి బాలీవుడ్ సిని మా అని ప్రచారం చేసినా `లాల్ సింగ్ చ‌డ్డా`ని ప‌ట్టించుకునే ప్రేక్ష‌కుడు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల చైతూ త‌న కెరీర్ లోనే అత్యంత డిజాస్ట‌ర్ ని `థాంక్యూ`తో ఎదుర్కొన్నాడు.

ఈ మూవీతో అయినా హిట్ ని సొంతం చేసుకుంటాడ‌ని భావిస్తే అది జ‌రిగే ప‌నిలా క‌నిపించ‌డం లేద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు కూడా పెద‌వి విరుస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున క‌లిసి ప్ర‌మోట్ చేసినా క‌నీసం బ‌జ్ ని ఈ మూవీకి క్రియేట్ చేయ‌లేక‌పోవ‌డం ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది.

ఈ మూవీకి బ‌జ్ ని క్రియేట్ చేయాల‌ని చిరు, నాగ్ ట్రై చేసినా పెద్ద‌గా ఫలితం లేక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం గ‌త కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా బాయ్ కాట్ లాల్ సింగ్ చ‌డ్డా అంటూ కొంత మంది నెటిజ‌న్ లు అగ్రెసీవ్ గా ప్ర‌చారం చేయ‌డ‌మే అని తెలుస్తోంది. దాదాపు రూ. 200 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందిన ఈ మూవీ భారీ డిజాస్ట‌ర్ గా నిలుస్తుందా? లేక మౌత్ టాక్ తో నిల‌బ‌డుతుందా? అన్న‌ది మ‌రి కొన్ని గంట‌ల్లో తేల‌నుంది.
Tags:    

Similar News