రామ్ గోపాల్ వర్మకు ప్రతీ చోట ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంత మంది నిర్మాతలు డబ్బులు వర్మ తాము ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించడం లేదంటూ ఆయనపై కేసులు పెడుతుంటే మరో పక్క ఆయన సినిమాల పోస్టర్లని ప్రభుత్వ సిబ్బంది దగ్గరుండి మరీ చించేయించయడం జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మార్షల్ ఆర్ట్స్ మూవీ `లడ్కీ`. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించింది. బ్రూస్ లీ స్ఫూర్తితో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే ఓ యువతి కథగా ఈ మూవీని వర్మ తెరకెక్కించాడు.
అయితే మార్షల్ ఆర్ట్స్ పేరుతో హీరోయిన్ పూజా భలేకర్ అందాలని చూపిస్తూ వర్మ తెరకెక్కించిన ఈ మూవీలోని సీన్స్, ఫైట్స్ పై పలువురు ఇప్పటికే ఘాటుగా కామెంట్ లు చేశారు.
సినిమా మార్షల్ ఆర్ట్స్ కోసం కాకుండా హీరోయిన్ పూజా భలేకర్ అందాల ప్రదర్శన కోసమే రూపొందించినట్టుగా వుందంటూ నెటిజన్ లు, ప్రేక్షకులు కామెంట్ లు చేశారు. జూలై 15న విడుదలైన ఈ మూవీ రిలీజ్ ని ఆపాలంటూ శేఖర్ రాజు అనే ప్రొడ్యూసర్ వర్మపై కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. దీంతో ఈ మూవీ రిలీజ్ కాస్త ఆగిపోయిందని తెలిసింది.
ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ పోస్టర్లని నరసారావు పేటలోని ప్రధాన రహదారుల్లో వున్న గోడలపై అంటించారట. నరసారావు పేట కలెక్టర్ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో నిబంధనలకు విరుద్ధంగా వున్న `లడ్కీ` పోస్టర్లని సిబ్బందిని పిలిపించి మరీ ఆయనే దగ్గరుండి చించేయించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.
అంతే కాకుండా జిల్లా వ్యాప్తంగా వున్న సినిమా హాలు యజమానులతో అశ్లీల పోస్టర్ల విషయమై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని నరసారావు పేట కలెక్టర్ థియేటర్ యాజమాన్యాలను మందలించాలనే ఆలోచనలో వున్నట్టుగా అక్కడి వర్గాలు చెబుతున్నాయి. అసలే స్టే కారణంగా రిలీజ్ ఆగిపోయిన చిరాకులో వున్న వర్మ పోస్టర్ ల వివాదంపై ఎలా స్పందిస్తారో చూడాలి.