విజయ్ కుమార్తెను అంత మాటన్న యువకుడి అరెస్ట్

Update: 2020-10-21 08:30 GMT
వరుస విమర్శల నేపథ్యంలో శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అధికారిక ప్రకటన ఇచ్చారు. మురళీధరన్ కోరిక మేరకు ఈ బయోపిక్ నుంచి తాను తప్పుకుంటున్నట్టు సేతుపతి ఒక ప్రకటనలో వెల్లడించారు.

అయితే ఈ మూవీ నుంచి తప్పుకున్న విజయ్ పై ఆగ్రహావేశాలు తమిళనాట చల్లారడం లేదు. అతడిని కించపరుస్తూ కొంతమంది కామెంట్లు పెట్టారు. ఇటీవల ఓ నెటిజన్ అయితే విజయ్ సేతుపతి కుమార్తెను అత్యాచారం చేస్తామంటూ సోషల్ మీడియాలో కామెట్ పెట్టాడు.

తాజాగా ఆ నెటిజన్ పేరు రితిక్ అని.. అతడే విజయ్ కూతురిని రేప్ చేస్తానంటూ సోషల్ మీడియాలో బెదిరించాడని గుర్తించారు. దీనిపై పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. రిత్విక్ ను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ బెదిరింపులు ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా డీఎంకే ఎంపీలు కనిమొళి, ఎస్ సెంథిల్ కుమార్, సింగర్ చిన్మయి శ్రీపాద కూడా సోషల్ మీడియాలో స్పందించారు. ‘మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం అని.. దీనిపై చర్యలు తీసుకోండి అని.. అతడిని అరెస్ట్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం, పోలీసులకు’ ట్యాగ్ చేశారు.

ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి తన కుమార్తెపై లైంగిక  బెదిరింపులకు పాల్పడ్డ యువకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన చెన్నై పోలీసులు రంగంలోకి దిగారు. రితిక్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ను ఐపీ అడ్రస్ ద్వారా గుర్తించారు. పోలీసులు చివరకు రితిక్ రాజ్ గా గుర్తించి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విజయ్ కుటుంబాన్ని బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చెన్నై పోలీస్ కమిషనర్ తెలిపారు.
Tags:    

Similar News