చెన్నైలో ల్యాండ్ అయిన చ‌ర‌ణ్‌

Update: 2022-01-08 03:30 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీ జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంద‌ని అంతా ఊహించారు. దాదాపు మూడేళ్ల శ్ర‌మ ఫ‌లితాన్ని వెండితెర‌పై చూసుకుని ఆనందించాల‌ని వేయిక‌ళ్ల‌తో ఎదురుచూసిన స్టార్ హీరోల‌కు ఈ మూవీ రిలీజ్ వాయిదాప‌డ‌టం షాకిచ్చింది. ఎంతో ఆశ‌గా ఎదురుచూసిన `ఆర్ ఆర్ ఆర్‌` రిలీజ్ పోస్ట్ పోన్ కావ‌డంతో వృధా అయిన స‌మ‌యాన్ని సద్వినియోగం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌.

ఈ ఇద్ద‌రిలో ముందుగా రామ్ చ‌ర‌ణ్ జోరు పెంచేశాడు. సినిమా రిలీజ్ వాయిదాప‌డ‌టంతో వెంట‌నే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా త‌న‌కు చిక్కిన స‌మ‌యాన్నిశంక‌ర్ సినిమా కోసం కేటాయించ‌డం మొద‌లుపెట్టాడు. ఈ మూవీ షూటింగ్ చెన్నైలో జ‌రుగుతుండ‌టంతో అక్క‌డ వాలిపోయాడు. త‌న‌ కెరీర్ లోనే అత్యంత భారీ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం చెన్నైలో అడుగుపెట్టేశాడు చ‌ర‌ణ్. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ ప‌నుల్లో బిజీగా మారిపోయాడు.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఇక శంక‌ర్ సినిమా అంటే భారీ సెట్టింగులు... హంగు ఆర్భాటాలు తెలిసిన‌వే. చ‌ర‌ణ్ సినిమాకు కూడా ఆయ‌న గ‌త చిత్రాల‌కు మించి క‌ళ్లు చెదిరే సెట్టింగులు వుంటాయ‌ని తెలుస్తోంది. ఇందు కోసం ఇప్ప‌టికే భారీ సెట్ ల‌ని నిర్మిస్తున్నార‌ట‌. ఇక మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే శంక‌ర్ సినిమా అంటే యాక్ష‌న్ బ్లాక్స్ ఓ రేంజ్ లో హైలైట్ అవుతుంటాయి. ఆ విష‌యంలోనూ ఈ మూవీ ప్ర‌త్యేకంగా వుండ‌బోతోంద‌ని, చ‌ర‌ణ్ కోసం శంక‌ర్ భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ని ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది.

లేటెస్ట్ న్యూస్ ని బ‌ట్టి శంక‌ర్ మార్కు సినిమాగా ఈ ప్రాజెక్ట్‌ మ‌రింత స్పెష‌ల్ గా ప్ర‌త్యేక‌ హంగుల‌తో వుండ‌బోతోంద‌ని తెలుస్తోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని దిల్ రాజు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. చ‌ర‌ణ్ 15వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో మ‌ల‌యాళ న‌టుడు జ‌య‌రామ్‌, అంజ‌లి, సునీల్‌, శ్రీ‌కాంత్‌, న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి తిరు సినిమాటోగ్రాఫ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
Tags:    

Similar News