శంక‌ర్ కూతురు హీరోయిన్ గా.. హీరో ఎవ‌రంటే?

Update: 2021-09-06 04:41 GMT
త‌న సినిమాల‌తో ఎంద‌రినో స్టార్లుగా మ‌లిచిన గొప్ప ద‌ర్శ‌కుడు శంక‌ర్. సాధార‌ణ క‌థానాయిక‌ల్ని కూడా అసాధార‌ణ విజువ‌ల్ బ్రిలియ‌న్సీతో జాతీయ స్థాయి గుర్తింపును తేగ‌లిగిన నిపుణుడు. అలాంటి స్టార్ డైరెక్ట‌ర్ కుమార్తెను ఇప్పుడు హీరో సూర్య క‌థానాయిక‌గా ప‌రిచ‌యం చేస్తుండ‌డం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఆర్సీ 15 చిత్రంతో శంక‌ర్ టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ - కియ‌రా అద్వానీ జంట‌గా దిల్ రాజు నిర్మాత‌గా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత భారీగా తెర‌కెక్కించేందుకు శంక‌ర్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే అన్న‌పూర్ణ స్టూడియ‌స్ లో చ‌ర‌ణ్ పై ఫోటోషూట్ చేశారు. అలాగే ఈనెల 8న సినిమా ఘ‌నంగా ప్రారంభం కానుంది. తొలిగా చ‌ర‌ణ్ - కియ‌రా జంట‌పై ఓ పాట‌ను చిత్రీక‌రిస్తార‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఓవైపు టాలీవుడ్ క్రేజీ సినిమాని ప్రారంభిస్తున్న శంక‌ర్ కి సూర్య గుడ్ న్యూస్ అందించారు.  హీరో సూర్య తన తదుపరి సినిమాతో శంకర్ కుమార్తె అదితి శంకర్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు. 2డి ఎంట‌ర్ టైన్ మెంట్స్ లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కార్తీ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు.

దీనికి సంబంధించి అధికారిక ప్రకటన తాజాగా వెలువ‌డింది. ``అదితి శంకర్ కి సాదర స్వాగతం. మీరు అందరి హృదయాలను గెలుచుకోబోతున్నారు! దేవుడు ఆశీర్వాదాలు మీకు ఉన్నాయి !!`` అంటూ సూర్య ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  శంక‌ర్ స్పందిస్తూ.. ``ప్రియమైన సూర్య అండ్ జ్యోతిక 2D ఎంట‌ర్ టైన్ మెంట్ ప్రై లిమిటెడ్ ని ప్రారంభించి ఎల్లప్పుడూ నాణ్యమైన సినిమాలను అందిస్తున్నందుకు ధన్యవాదాలు!`` కార్తీ .. ద‌ర్శ‌కుడు ముత్త‌య్య -రాజ‌శేఖ‌ర్ పాండియ‌న్ కి ధ‌న్యవాదాలు. సినీ ప్రేమికులు నా కుమార్తె అరంగేట్రానికి పూర్తిగా సిద్ధమవుతున్నందున తమ ప్రేమతో ముంచెత్తుతారని నేను నమ్ముతున్నాను`` అని అన్నారు.

``ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సూర్య స‌ర్ #జ్యోతిక మేడమ్ గారికి చాలా ధన్యవాదాలు. మిమ్మ‌ల్ని గర్వపడేలా చేస్తాను. వంద‌శాతం కృషి చేస్తాను`` అని అదితి తెలిపింది. `విరుమన్` అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Tags:    

Similar News