సాహోకు మేం కాదన్న సంగీత దర్శకులు

Update: 2019-05-27 15:27 GMT
మొన్న విడుదలైన కొత్త పోస్టర్ తో పాటు ఇవాళ విడుదలైన మరో పిక్ లో సాహోకు సంబంధించిన టెక్నికల్ టీమ్ పేర్లు ఇచ్చారు కానీ అందులో సంగీత దర్శకుల పేర్లు లేకపోవడం పట్ల చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటికి క్లారిటీ ఇస్తూ తాము ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు స్నేహితుల ద్వయం శంకర్ ఎహసాన్ లాయ్ లు స్వయంగా ప్రకటించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది.

నిజానికి ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి వీళ్ళ పేర్లే సాహోకు ప్రమోట్ అవుతూ వచ్చాయి. పాటల రికార్డింగ్ చేశారన్న టాక్ కూడా వచ్చింది. మరి ఇప్పుడు విడుదలకు కేవలం రెండున్నర నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఇలా తప్పుకోవడం అంటే తెరవెనుక ఏదో జరిగిందన్న సంకేతాలకు బలం చేకూరినట్టే

ఇప్పుడు సాహోకు రీ రికార్డింగ్ ఎవరు చేస్తారు అనేది భేతాళ ప్రశ్నగా నిలిచింది. టీజర్ కి కంపోజ్ చేసిన థమన్ కే బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నాయని ఇన్ సైడ్ టాక్. నిజానికి ఆప్షన్స్ కూడా పెద్దగా లేవు. ఇంత భారీ కాన్వాస్ ఉన్న మూవీకి ఇవ్వగలిగింది అతనొక్కడే. లేదా మణిశర్మనో దేవిశ్రీ ప్రసాదో ట్రై చేయాలి.

యూత్ పల్స్ ని బాగా ఒడిసిపట్టే థమన్ అయితేనే బెటరని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడీ సస్పెన్సు తేలాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదంతా ఓకే కానీ మరి ప్రభాస్ శ్రద్ధా కపూర్ మీద షూట్ చేసిన పాటలు కంపోజ్ చేసింది శంకర్ బ్యాచే కదా. సో బీజీఎమ్ కు మాత్రమే ఇప్పుడు ఇంకొకరు అవసరం అన్న మాట. ఇదేదో యువి సంస్థ ట్వీట్ ద్వారా అఫీషియల్ క్లారిటీ ఇస్తే బెటర్.

    

Tags:    

Similar News