12 రోజుల్లో 12 కోట్ల ఖర్చు.. వామ్మో

Update: 2017-02-18 13:05 GMT

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తో సెన్సేషనల్ మూవీస్ తీసిన శంకర్.. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న రోబో సీక్వెల్ 2.0 విషయంలో కూడా చాలా పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయిపోగా.. ప్రస్తుతం ఓ కీలక షెడ్యూల్ ను పిక్చరైజ్ చేస్తున్నారు. 12 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో ఏరియల్ స్టంట్స్ ను ఆధారం చేసుకుని.. ఓ యాక్షన్ ఎపిసోడ్ ను తీస్తున్నారని ఇప్పటికే చెప్పుకున్నాం.

అయితే.. ఈ 12 రోజుల షెడ్యూల్ కు అవుతున్న ఖర్చు ఎంతో తెలుసా.. ఏకంగా 12 కోట్లను కరిగించేస్తున్నాడట శంకర్. అది కూడా ప్రత్యేకంగా పిలిపించిన హాలీవుడ్ టెక్నీషియన్స్ కు ఇచ్చే రెమ్యూనరేషన్ కాకుండానే అంటున్నారు. ఏరియల్ స్టంట్స్ ను పిక్చరైజ్ చేసే ఎక్విప్మెంట్ కోసమే.. రోజుకు ఒక కోటి కరిగిపోతోందిట. హీరో రజినీకాంత్.. విలన్ అక్షయ్ కుమార్ ల మధ్య వచ్చే కీలకమైన ఫైట్ సీక్వెన్స్ కావడంతో.. భారీగా ఉండేలా ప్లాన్ చేశాడట దర్శకుడు శంకర్.

ప్రధానంగా గ్రాఫిక్స్ ఆధారిత చిత్రం కావడంతో.. ఇప్పుడు 2.0ను బాహుబలితో పోల్చుతారనే విషయంలో శంకర్ కు బోలెడంత క్లారిటీ ఉంది. అందుకే అంతకు మించి ప్రతీ ఫ్రేమ్ కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అందుకే కేవలం పిక్చరైజేషన్ కోసం ఇంత మొత్తం వెచ్చించేస్తున్నారని టాక్. ఇక గ్రాఫిక్స్.. ప్రమోషన్స్ తో కూడా కలుపుకుని.. 2.0 మూవీపై మొత్తం రూ. 450 కోట్లు పెట్టుబడి పెట్టేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News