2.0 కోసం శంకర్ తగ్గాడా?

Update: 2017-10-28 17:30 GMT
ఇండియాన్ సూపర్ స్టార్ సినిమా 2 పాయింట్ 0 పై ఇప్పుడు అంచనాలు మాములుగా లేవు. మొన్నటి వరకు ఇండియాలోనే ఈ సినిమాపై అంచనాలు ఉండేవి. కానీ నిన్న దుబాయ్ లో జరిపిన ఆడియో వేడుక తర్వాత విదేశాల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. మొట్ట మొదటిసారి ఒక సౌత్ సినిమా ఆడియో వేడుక హాలీవుడ్ సినిమాల వేడుకలు జరిగినట్లు జరిగిందనే చెప్పాలి. దర్శకుడు శంకర్ ప్రతి చిన్న విషయంలో సినిమాని ఏ మాత్రం తగ్గించకుండా ఆకాశం అంచుల వరకు చూపిస్తున్నాడు.

దుబాయ్ లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఆ అద్భుతాల మధ్యన 2.0 ఆడియో వేడుకను నిర్వహించి చిత్ర యూనిట్ మరో అద్భుతాన్ని సృష్టించిందని అంతర్జాతీయ మీడియాలో అనేక  కథనాలు వెలువడుతున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాపై ఇంటర్ నేషనల్ లెవెల్ లో మార్కెట్ ని ఇప్పటికే నిర్మాతలు సెట్ చేసుకున్నారట. పూర్తిగా సినిమా 3డి లో తెరక్కించిన శంకర్ రన్ టైమ్ ని కూడా దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ను సెట్ చేసుకున్నాడట. సాధారణంగా శంకర్ సినిమాల రన్ టైమ్ 170 నిమిషాలకు తక్కువ ఉండవు. కానీ 2.0 సినిమా రన్ టైమ్ మాత్రం కేవలం 140 నిముషాలకు సెట్ చేశాడట ఈ దర్శకుడు. అందుకు ముఖ్య కారణం ఇంటర్నేషనల్ మార్కెట్లో సినిమాను విడుదల చేయడమే.

సాధారణంగా హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా అంటే 120 నిముషాలు మాత్రేమే నిడివి సమయాన్ని కలిగి ఉంటాయి. అంతకంటే ఎక్కువ సేపు విదేశీయులు సినిమాను చూడటానికి ఇష్టపడరు. ఈ రోజుల్లో నిడివి సమయం ఎక్కువగా ఉండడం కూడా సినిమాకి కొంచెం ఎఫెక్ట్ అవుతోంది. దీంతో శంకర్ మొదటి సారి తన ప్రతిష్టాత్మక చిత్రం రన్ టైమ్ ని తగ్గించాడు. మరి ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుందో చూడాలి.     
Tags:    

Similar News