మొత్తానికి ‘2.0’ ట్రైలర్ వచ్చేసింది. అనుకున్నట్లే ఈసారి శంకర్ హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలంతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించబోతున్నాడని ఈ ట్రైలర్ చూస్తే అర్థమైంది. సినిమాకు అదే ప్రధాన ఆకర్షణ కాబోతోందని అర్థమైంది. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ట్రైలర్లో దాదాపుగా ప్రతి షాట్‌లోనూ వీఎఫెక్స్ మాయాజాలం కనిపించింది. చిట్టి రోబోకు.. విలన్ డాక్టర్ రిచర్డ్ కు మధ్య పతాక స్థాయి పోరాటాలు ఖాయమని తెలుస్తోంది.
కానీ ‘రోబో’తో పోలిస్తే.. ‘2.0’లో మిస్సయిన కొన్ని కీలక అంశాలున్నాయి. ‘రోబో’లో కేవలం యాక్షన్ ఎపిసోడ్లు మాత్రమే ఉండవు. ద్వితీయార్ధంలో రోబో విలన్ గా మారాక వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు ప్రేక్షకులకు అప్పట్లో కళ్లు చెదిరిపోయేలా చేసిన మాట వాస్తవం. కానీ అంతకంటే ముందు చిట్టి రోబో కావాల్సినంత వినోదం కూడా పంచుతాడు. ప్రథమార్ధంలో వచ్చే కామెడీ ఎపిసోడ్లు అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించాయి. మనసుకు హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి అందులో. అలాగే రజనీ-ఐశ్వర్యల రొమాంటిక్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది. ‘రోబో’ పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకోవడానికి ఇలా పలు ఆకర్షణలు ఉండటమే కారణం.
ఐతే ‘2.0’ చూస్తే ఇందులో మొత్తం హీరో-విలన్ పోరు తప్ప ఇంకేమీ ఉండదేమో అనిపిస్తోంది. ఇందులో ఎంటర్టైన్మెంట్ పాళ్లు తక్కువే అనిపిస్తోంది. శంకర్ ప్రధానంగా విజువల్ ఎఫెక్ట్స్ మీదే దృష్టిపెట్టినట్లుంది. ఈ విషయంలో హాలీవుడ్ ప్రమాణాల్ని అందుకునేందుకు ప్రయత్నించినట్లుంది. ఈ క్రమంలో ‘రోబో’లాగా దీన్ని ఇండియనైజ్.. లోకలైజ్ చేయడంలో శంకర్ విఫలమయ్యాడేమో అనిపిస్తోంది. ‘2.0’ ట్రైలర్ చూశాక సినిమాలో సోల్ మిస్సయిందేమో అన్న భావన జనాలకు కలగడానికి ఇదే కారణం. మరి ట్రైలర్లో చూపించని కోణాలేవైనా సినిమాలో చూపించి శంకర్ మెప్పిస్తాడేమో చూడాలి.