అన్ని విషయాల్లో '2.ఓ' ను మించేలా మరోటి!

Update: 2019-01-03 01:30 GMT
సౌత్‌ సినిమాల స్థాయిని అమాంతం పెంచిన దర్శకుల్లో శంకర్‌ ఒకరు. ఈయన బాలీవుడ్‌ సినిమాలను కూడా తదన్నేలా పలు చిత్రాలను తెరకెక్కించిన విషయం తెల్సిందే. తాజాగా ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘2.ఓ’ చిత్రం ఏకంగా 550 కోట్ల బడ్జెట్‌ తో రూపొందింది. సౌత్‌ లోనే కాకుండా ఉత్తరాధిన మరియు వివిధ దేశాల్లో భారీ వసూళ్లను రాబట్టింది. 2.ఓ చిత్రంలో రజినీకాంత్‌ తో పాటు అక్షయ్‌ కుమార్‌ కీలక పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. పక్షిరాజు పాత్రకు మొదట అక్షయ్‌ కుమార్‌ కు బదులుగా పలువురు స్టార్స్‌ ను పరిశీలించిన శంకర్‌ ఆ క్రమంలోనే హృతిక్‌ రోషన్‌ తో కూడా చర్చలు జరిపాడు.

‘2.ఓ’ చిత్రంపై అప్పట్లో హృతిక్‌ రోషన్‌ ఆసక్తి చూపించలేదు. దాంతో ఆ పాత్రను అక్షయ్‌ కుమార్‌ తో శంకర్‌ చేయించాడు. సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో హృతిక్‌ రోషన్‌ స్పందిస్తూ.. సినిమా చాలా బాగుంది, ఇలాంటి సినిమాలు - పాత్రలను చేసేందుకు తాను కూడా ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. దాంతో పాటు స్వయంగా శంకర్‌ తో మాట్లాడి సినిమా చేద్దామని హృతిక్‌ రోషన్‌ హామీ కూడా ఇచ్చినట్లుగా బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

ప్రస్తుతం ‘భారతీయుడు’ సీక్వెల్‌ ఇండియన్‌ 2 చిత్రాన్ని చేస్తున్న శంకర్‌ వచ్చే ఏడాదిలో హృతిక్‌ రోషన్‌ తో మూవీ  మొదలు పెట్టబోతున్నాడు. ‘2.ఓ’ చిత్రాన్ని మించి బడ్జెట్‌ మరియు అంతకు మించిన టెక్నికల్‌ ఎలిమెంట్స్‌ తో హృతిక్‌ తో మూవీ ఉంటుందని సన్నిహితుల వద్ద శంకర్‌ చెప్పుకొచ్చాడట. హృతిక్‌ మూవీతో శంకర్‌ బాలీవుడ్‌ డైరెక్ట్‌ సినిమా చేయబోతున్నాడంటూ హిందీ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.


Full View

Tags:    

Similar News