తమిళ - తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా - ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న ‘2.ఓ’ చిత్రం మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. రజినీకాంత్ - అక్షయ్ కుమార్ లు ఢీ కొట్టబోతున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. విజువల్ వండర్ గా - హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రంను దర్శకుడు శంకర్ తెరకెక్కించిన విషయం ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. అయితే ఈ చిత్రం గత సంవత్సరం విడుదలవ్వాల్సి ఉన్నా కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
సినిమా విడుదల సందర్బంగా హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు శంకర్ సినిమాకు సంబంధించిన పలు విషయాల గురించి ఆసక్తికర విషయాలను మీడియాతో షేర్ చేసుకున్నాడు. సినిమాను గత సంవత్సరమే విడుదల చేయాలని ఆడియో వేడుక కూడా భారీ ఎత్తున నిర్వహించాం. ఆడియో వేడుక తర్వాత రెండు నెలలకు సినిమా విడుదల చేయాలనుకున్నాం. అయితే ఆడియో విడుదల తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ మాకు షాకింగ్ విషయం చెప్పింది. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తి అవ్వడానికి ఇంకా సంవత్సరం పడుతుందని చెప్పి షాక్ ఇచ్చారు.
ఆడియో విడుదల తర్వాత అలా చెప్పడంతో మేం ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలోనే ఆ కంపెనీకి ఇంత భారీ సినిమాను చేసే సత్తా లేదని తేల్చుకుని - అంతకంటే పెద్ద విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీకి ఈ సినిమాను ఇచ్చాం. వారు మేము అనుకున్న సమయానికి - అనుకున్నట్లుగా ఇచ్చారు. ఔట్ పుట్ కూడా చాలా బాగా వచ్చిందని శంకర్ అన్నాడు. సినిమా ఆలస్యం అయినా కూడా ఒక అద్బుతమైన విజువల్ మూవీని చూసిన అనుభవం ప్రేక్షకులకు కలుగుతుందని శంకర్ హామీ ఇచ్చాడు. 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్ గా అమీ జాక్సన్ నటించిన విషయం తెల్సిందే. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు - ఎన్వీ ప్రసాద్ లు సంయుక్తంగా విడుదల చేస్తున్నారు.