నిఖిల్ నటించిన స్మాల్ బడ్జెట్ మూవీ శంకరాభరణంపై అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రామిసింగ్ మూవీ అని ముందునుంచే టాక్ ఉన్న మూవీ ఇది. కానీ ఇప్పుడు శంకరాభరణానికి శాటిలైట్ రైట్స్ ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు పలకడం చూస్తే.. నోరెళ్ల బెట్టాల్సిందే. కోన వెంకట్ - గోపీ మోహన్ లు రాసిన స్క్రిప్ట్ - డైలాగ్స్ శంకరాభరణానికి చాలా కీలకం. ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతోంది ఈ మూవీ.
తాజాగా రిలీజ్ చేసిన టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా.. సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ పైనే రిలీజ్ చేశారు ఫన్ ఫిల్డ్ టీజర్ ని. ఆ వెంటనే శంకరాభరణంపై అందరి దృష్టి పడింది. జీ మీడియా గ్రూప్ మూవీ టీంని అప్రోచ్ అయ్యి.. ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేసింది. ఏకంగా 4 కోట్లు ఇచ్చేందుకు ముందుకు రావడంతో.. వెంటనే యాక్సెప్ట్ చేసేశారు శంకరాభరణం టీం. నిఖిల్ - నందిత జంటగా నటిస్తున్న ఈ చిత్ర నిర్మాణంలో కోన వెంకట్ కి కూడా భాగస్వామ్యం ఉండగా.. అంజలి ప్రత్యేక పాత్ర పోషిస్తుండడం విశేషం.
శంకరాభరణం టీజర్ ని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంఛ్ చేయడంతో.. యూట్యూబ్ లోనూ మంచి క్లిక్స్ వస్తున్నాయి. ఇఫ్పటికే 2 లక్షల హిట్స్ దాటిపోవడం విశేషం. అంచనాలు బాగానే ఉన్నాయి, టీజర్ లో ఫన్ అదిరింది. ఫస్ గయా ఒబామా అనే మూవీ ఇన్ స్పిరేషన్ తో శంకరాభరణం స్క్రిప్ట్ రెడీ చేశారనే టాక్ వినిపిస్తోంది.