మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎక్కువగా మాస్ కమర్షియల్ సినిమాలను లేదా రీమేక్ సినిమాలను తెరపైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో ఆయన స్పీడ్ మరింత పెరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతమైతే వాల్తేరు వీరయ్య సంక్రాంతికి రావడానికి రెడీగా ఉంది. ఇక ఆ సినిమా తర్వాత భోళా శంకర్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అలాగే లిస్టులో వెంకీ కుడుముల ప్రాజెక్టు కూడా పూర్తి చేయాల్సి ఉంది.
ఇక మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి మరి కొంతమంది యువ దర్శకులు కూడా ఉన్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా కాంబినేషన్ ను కూడా మళ్లీ రిపీట్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాను జయంత్ సి ఫరాన్జీ తెరపైకి తీసుకు రాగా శంకర్ దాదా జిందాబాద్ సినిమాను ప్రభుదేవా డైరెక్ట్ చేశాడు.
ఈ రెండు కూడా బాలీవుడ్ బాలీవుడ్ మున్నాభాయ్ సీరీస్ లకు రీమేక్ గా వచ్చాయి. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ప్రభుదేవా ఒక సినిమా చేయడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2007లో శంకర్ దాదా జిందాబాద్ సినిమా చేసిన మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాతో అనంతరం రాజకీయాల్లోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా డిజాస్టర్ కూడా అయ్యింది.
ఇక మళ్లీ చిరు ఇప్పుడు ప్రభుదేవా దర్శకత్వంలోనే మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. అయితే గత కొంతకాలంగా చూసుకుంటే ప్రభుదేవా ట్రాక్ కూడా అంతగా సక్సెస్ ఫుల్ గా ఏమీ లేదు. అతను కూడా చాలా రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు అనే విధంగా కామెంట్స్ అయితే అందుకుంటున్నాడు.
ముఖ్యంగా చివరగా సల్మాన్ ఖాన్ తో డైరెక్ట్ చేసిన రాధే సినిమా మాత్రం దారుణంగా ట్రోలింగ్ బారిన పడింది. మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే అతని స్టార్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని సినిమా తీస్తాడు అని చెప్పవచ్చు. మరి ఈ కాంబినేషన్ ఫైనల్ అవుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.