తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 పూర్తి అయ్యింది. విన్నర్ గా సన్నీ నిలువగా.. రన్నర్ గా షన్నూ నిలిచాడు. ఇక టాప్ 5 లో ఒన్ అండ్ ఓన్లీ లేడీ సిరి నిలిచింది. హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తనపై జరుగుతున్న నెగటివ్ ప్రచారంకు ఆమె షాక్ అయ్యింది. షన్నూ తో నాది ఒక మంచి ఫ్రెండ్ షిప్. దాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని సిరి చెప్పుకొచ్చింది. ఇక షన్నూ స్వయంగా సిరితో హౌస్ లో స్నేహం వల్ల తాను విజేత కాలేక పోయాను అన్నట్లుగానే బిగ్ బాస్ బజ్ లో మాట్లాడాడు. సన్నీ ఈ సమయంలో తన దైన శైలిలో ఎంటర్ టైన్ చేస్తూ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోయాడు. ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎవరి జీవితాలు వారివి.. ఎవరి రిలేషన్ లు వాళ్లకు ఉన్నారు. ఈ సమయంలో వారి యొక్క ఆలోచన ఎలా ఉందా అనే విషయం తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తిని కనబర్చుతున్నారు.
బిగ్ బాస్ బజ్ లో అరియానా పలు ఆసక్తికర విషయాలను సిరి నుండి రాబట్టే ప్రయత్నం చేసింది. అందులో ముఖ్యంగా షన్నూ తో అంతగా ఎందుకు హౌస్ లో కనెక్ట్ అయ్యారు అంటూ ప్రశ్నించగా ఇద్దరం మంచి స్నేహితులం.. చాలా సపోర్ట్ గా నాకు షన్నూ నిలవడం వల్లే నేను అతడికి కనెక్ట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. సన్నీ కూడా తనకు మంచి ఫ్రెండ్ కాని అతడితో ఎందుకో ర్యాపో కుదరలేదు. కాని ఇద్దరం కూడా మంచి స్నేహితులం అన్నట్లుగా చెప్పుకొచ్చింది. సన్నీ విజేతగా నిలిచినందుకు కూడా చాలా సంతోషంగా ఉందని సిరి చెప్పుకొచ్చింది. హౌస్ లో కాజల్ మరియు కొందరు కంటెంట్ ఇచ్చేందుకు బరా బర్ వచ్చాం అంటూ మాట్లాడటం నాకు నచ్చలేదు. అందుకే అప్పటి నుండి కాజల్ తో బాగా కనెక్ట్ కాలేక పోయాను అంటూ సిరి చెప్పుకొచ్చింది.
అరియానా మాట్లాడుతూ షన్నూ మరియు ఛోటూ ల్లో ఎవరికి ఎక్కువ ప్రాముఖ్య అన్నట్లుగా ప్రశ్నించగా.. మరో ఆలోచన లేకుండా తనకు ఛోటూ ఫస్ట్ ప్రియారిటీ అన్నట్లుగా సమాధానం చెప్పింది. ఛోటూ తన జీవితంలోకి మొదట వచ్చాడు. అతడితో జీవితాన్ని పంచుకోబోతున్నాను. కనుక నా జీవితంలో ఎప్పటికి కూడా చోటు కు ప్రథమ స్థానం ఉంటుంది అన్నట్లుగా చెప్పుకొచ్చింది. షన్నూ కూడా నా జీవితంలో చాలా ముఖ్యమైన స్నేహితుడు. అతడు నాకు చాలా అండగా నిలిచాడు.
అతని జీవితం.. అతిడి రిలేషన్ కూడా కొనసాగుతుంది. కనుక అతడి జీవితం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మొత్తానికి హౌస్ లో ఉన్న సమయంలో ఒకానొక సమయంలో కాస్త ఎమోషనల్ గా కనెక్ట్ అయినా.. అంతకు మించి కనెక్షన్ పెంచుకున్నా కూడా ఇప్పుడు మాత్రం అదేం లేదు అన్నట్లుగా బయట ఎవరి జీవితాలు వారివి అన్నట్లుగా సిరి మరియు షన్నూల మాటలను బట్టి అర్థం అవుతుంది. వారు వారి పాత రిలేషన్స్ తో సంతోషంగా ఉండాలని వారి వారి అభిమానులు కోరుకుంటున్నారు.