హీరోయిన్ ఫిజిక్‌ తో డైరెక్టర్ ఆటలు

Update: 2015-12-30 19:30 GMT
‘ఐ’ సినిమా కోసం విక్రమ్ ఎంత కష్టపడ్డాడో చూశాం. ఇక ‘సైజ్ జీరో’ కోసం అనుష్క కూడా అలాంటి కష్టమే పడింది. ‘లవ్లీ’ గర్ల్ శాన్వి కూడా వాళ్లిద్దరి స్థాయిలో కాకున్నా ఓ సినిమా కోసం చాలానే కష్టపడిందట. కానీ కష్టపడి బరువు తగ్గాక.. ఇలా వద్దు మళ్లీ బరువు పెరగమని డైరెక్టర్ అంటే ఎలా ఉంటుంది? దీంతో ఒళ్లు మండిపోయిన ఆ అమ్మాయి ఆ సినిమా నుంచే తప్పుకుందట. ఇంతకీ ఆ సినిమా ఏది.. ఏంటా కథ.. తెలుసుకుందాం పదండి.

అప్పట్లో బ్యాచిలర్స్ - సంపంగి లాంటి హిట్టు సినిమాలు తీసిన సానా యాదిరెడ్డి గుర్తున్నాడు కదా. ఆయన చాలా విరామం తర్వాత ఓ సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడులెండి. హీరో మరెవరో కాదు.. వివాదాస్పద కేరళ క్రికెటర్ శ్రీశాంత్. ఈ సినిమా కోసం శాన్విని హీరోయిన్ గా ఎంచుకున్నాడు సానా. ఐతే ఈ పాత్ర కోసం కొంచెం బరువు తగ్గాల్సి ఉంటుందని చెప్పడంతో.. అమ్మడు రెండు మూడు నెలలు కష్టపడి బరువు తగ్గిందట

 డైరెక్టర్ కోరుకున్నట్లుగా తయారై, ఆయన ముందెళ్లి నిలబడితే.. ఇలా వద్దు మళ్లీ బరువు పెరగమని చెప్పాడట. దీంతో శాన్వికి ఒళ్లు మండిపోయి.. ఏంటి నా ఫిజిక్ తో ఆటలాడుతున్నారా అంటూ డైరెక్టరు మీద అరిచేసిందట. ఇద్దరికీ వాగ్వాదం నడిచి చివరికి ఆ సినిమా నుంచే తప్పుకుందట శాన్వి. దీంతో ముంబయి నుంచి ఇంకో కొత్తమ్మాయిని రప్పించి సినిమాలో నటింపజేయడానికి ట్రై చేస్తున్నాడట సానా.
Tags:    

Similar News