సర్దార్ గబ్బర్ సింగ్ పాటల పండగలో భాగంగా.. ఓ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు విలన్ గా నటిస్తున్న శరద్ కేల్కర్ - హీరోయిన్ సంజనలు లాంఛ్ చేశారు. వీళ్లిద్దరూ తమ రోల్స్ కి సంబంధించిన డీటైల్స్ పంచుకున్నారు. రతన్ పూర్ సన్సాద్.. భైరవ్ సింగ్ అంటూ శరద్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. అలాగే తన పేరు గాయత్రి అంటూ చెప్పుకొచ్చింది .
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. PSPK అంటూ అరుస్తూ శరద్ హంగామా చేసేశాడు. తను మొదటిసారిగా పవన్ కళ్యాణ్ తో నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు శరద్. అలాగే హీరోయిన్ సంజన కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తెగ పొగిడేసింది. గతంలో తాను పవన్ ని రీల్ లైఫ్ లోనే అభిమానించానని కానీ సర్దార్ లో చేసిన తర్వాత.. రియల్ లైఫ్ లోనూ అబిమానిగా మారిపోయానని చెప్పింది సంజన.
పవన్ అంటే మోస్ట్ ఇన్ స్పైరింగ్ యాక్టర్ అని.. తన కెరీర్ లోనే అంతటి స్ఫూర్తి నిచ్చిన హీరో ఎవరూ లేరని.. ఆయనతో పని చేయడం చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది సంజన. మొత్తానికి ఈ ఇద్దరూ కలిసి పాటను లాంఛ్ చేయడం వెనక సంథింగ్ సీక్రెట్ ఉందనే టాక్ ఉంది.