పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అయితే.. పవన్ తో కంటిన్యూగా ఫ్రెండ్ షిప్ చేయడం మాత్రం చాలా కష్టమైన విషయం అంటారు ఇండస్ట్రీ జనాలు. ఇప్పటివరకూ పవన్ సన్నిహితుల జాబితా చూస్తే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ఒకరిద్దరు మినహా.. సుదీర్ఘకాలం స్నేహం కొనసాగించిన వారు కనపడరు. అటు రాజకీయాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంటుంది.
అయితే.. పవన్ తో లాంగ్ టెర్మ్ స్నేహం చేసిన వారిలో శరత్ మరార్ కూడా ఒకరు. మాటీవీ బాధ్యతల తర్వాత.. పవన్ కు సన్నిహితుడిగా మారిన ఈయన.. పవర్ స్టార్ తో పలు సినిమాలు కూడా నిర్మించాడు. కానీ ఈ ఏడాది వచ్చిన కాటమరాయుడు మూవీ తర్వాత ఇద్దరి మధ్యా విబేధాలు తలెత్తాయని అంటారు. ప్రస్తుతం పవన్ తో ఈయన దూరంగానే ఉంటున్నాడట. కనీసం మాటలు కూడా లేవని ఓ టాక్ ఉంది. ఇలాంటి సమయంలో తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు డబ్బింగ్ సినిమా అదిరింది ని ఉపయోగించుకుంటున్నాడు శరత్ మరార్.
మెర్సల్ చిత్రానికి తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను తమిళ్ తో కలిపి రిలీజ్ చేయాలని భావించగా.. వివాదాల కారణంగా కొంత ఆలస్యం అయింది. ఈ నెల 9న అదిరింది చిత్రం విడుదల కానుండగా.. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని చూస్తున్న శరత్ మరార్.. పవన్ కు దూరం అయినా ఇండస్ట్రీలో తాను కుదురుకోవాలని భావిస్తున్నాడు.