శర్వానంద్.. పడిపూజ చేశాడు

Update: 2018-11-19 16:26 GMT
టాలీవుడ్లో ప్రతి సంవత్సరం కొందరు ప్రముఖులు అయ్యప్ప మాల ధరిస్తుంటారు. ఈ మధ్య పెద్ద వయస్కులే కాదు.. కుర్రాళ్లు సైతం మాల ధారణ చేస్తుండటం విశేషం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతి ఏడాది మాలలో కనిపిస్తుంటాడు. ఈ ఏడాది ఇంకా అతను మాల వేయలేదు. ఐతే అతడికి ఆప్తుడు.. చిన్ననాటి స్నేహితుడు అయిన శర్వానంద్ ఈసారి మాల ధరించడం విశేషం. అతను 42 రోజుల పాటు పూర్తి నిడివితో మాల వేయడం విశేషం. ఇటీవలే మాల ధరించిన శర్వా.. తాజాగా పిలిం నగర్ దైవ సన్నిధానంలో మహా పడిపూజ నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమలోని అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

సినీ రంగంలో ఉంటూ మాల ధరించి నిష్టతో వ్యవహరించడం అంత సులువు కాదు. మాలలో ఉన్నన్ని రోజులు నల్లటి దుస్తులే ధరించాలి. పాద రక్షలు వేసుకోకూడదు. నేల మీదే పడుకోవాలి. ఇవన్నీ పాటిస్తూ సినీ హీరోలు నిష్టతో ఉంటున్నారు. శర్వా కూడా ఈ బాటలోకి రావడం విశేషే. మహా పడి పూజ నిర్వహించడంతో పాటు అతను ఫిలిం నగర్ గుడిలో అన్నదానం కూడా చేశాడు. వందల మంది కడుపు నింపాడు. ఇక శర్వా సినీ కెరీర్ విషయానికి వస్తే.. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచె మనసు’ను పూర్తిచేశాడు. అది డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకొస్తుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో అతను నటిస్తున్న కొత్త సినిమా కూడా పూర్తి కావస్తున్నట్లు సమాచారం. మాల కోసం కొంత కాలం అతను సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నాడు.


Tags:    

Similar News