తెలుగులో పెద్ద హీరోలు వరస హిట్లు ఇవ్వలేక పోయినా చాలా సంధర్భాలలో చిన్న హీరోలు చిన్న సినిమాల వలన ఫిల్మ్ బిజినెస్ నడుస్తూ ఉంటుంది. భారీ అంచనాలు మధ్య వచ్చి ఫ్లాప్ అవ్వడం కన్న పరిమిత బడ్జెట్ అర్ధవంతమైన కథలతో వచ్చి మంచి విజయాలు అందిస్తున్నారు కొంతమంది హీరోలు డైరెక్టర్లు. హీరో శర్వానంద్ కూడా ఆ కోవలోకి చెందినవాడే. సంక్రాంతికి వచ్చి అందరితో శతమానం భవతి అనిపించాడు శర్వానంద్. తన కెరియర్లో నే పెద్ద కమర్షియల్ హిట్గా శతమానం భవతి సినిమాగా మిగిలిపోయింది.
అదే జోరులో వేసవి కాలపు సినిమాగా వచ్చిన సినిమా రాధా మాత్రం ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాలో కమర్షియల్ పేరుతో కాస్త అతి చేశారు అని టాక్ వచ్చింది. శర్వానంద్ నటనను అంతా మెచ్చుకుంటున్నా అతనికి మాస్ ప్రేక్షకుల పల్స్ ఇంకా తెలియలేదనే చెప్పాలి. అందుకే ఇప్పుడు మళ్ళీ తన బండి స్పీడ్ పెంచేసి వారికి చేరువైపోతాడ. మారుతీ డైరక్షన్లో ‘మహానుభావుడు’ అనే సినిమా షూటింగ్లో ఉంది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మరో రెండు విభిన్న కథాంశాలు ఉన్న సినిమాలులలో నటించబోతున్నాడు. ఆల్రెడీ ప్రకాష్ కోవెలమూడి డైరక్షన్ లో ఒకటి సుధీర్ వర్మ డైరక్షన్లో ఒక సినిమా చేయడానికి పచ్చ జెండా ఊపేశాడు. మహానుబావుడు పూర్తవ్వగానే ఈ రెండు సినిమాల షూటింగ్స్ ప్యారలెల్ గా జరుగుతాయట.
ప్రకాష్ డైరెక్ట్ చేస్తున్న సినిమాకు బాహుబలి నిర్మాత శోబు మరియు ప్రసాద్ నిర్మిస్తున్నారు. అలాగే సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న సినిమాకు యెస్ రాధాకృష్ణ నిర్మాతగా ఉండబోతున్నారు. మరైతే ఇప్పుడు కొంత దూరం వరకు శర్వానంద్ రెండు పట్టాలపై తన ఎక్స్ ప్రెస్ ను లాగేసి.. ఈ ఏడాదే మరో రెండు సినిమాలతో వస్తాడేమో చూడాలి.