పోటీ లేదంటూనే పాటలో గెలుపు..

Update: 2017-09-29 12:49 GMT
ఇవాల్టి రోజుల్లో సినిమా సక్సెస్ ను వేలంపాటతోనో.. గుర్రప్పందాలతోనో పోల్చడంలో ఏ మాత్రం తప్పులేదు. ఎందుకంటే అంచనాలు ఉన్న మూవీ ఆడకపోవచ్చు.. అసలు గెలుపు గుర్రమే కాదని భావించిన చిత్రం బ్లాక్ బస్టర్ కావచ్చు. ఒకేసారి రిలీజ్ అయితే.. ఇక అది వేలంపాట కిందే లెక్క.

దాదాపుగా ప్రధాన పండుగలకు పోటీ నెలకొన్న ప్రతీసారి.. తను కూడా ఆ పోటీలో పాల్గొంటున్నాడు శర్వానంద్. గతేడాది నాన్నకు ప్రేమతో.. సోగ్గాడే చిన్ని నాయన.. డిక్టేటర్ చిత్రాలు విడుదల అవుతుంటే.. వాటి మధ్యలో ఎక్స్ ప్రెస్ రాజాను నిలిపి ఆశ్చర్యపరిచాడు. చివరకు తను కూడా ఓ గెలుపు గుర్రంగా నిలిచాడు. ఈ ఏడాది సంక్రాంతికి కూడా సేమ్ సీన్. మెగాస్టార్ ఖైదీ నంబర్ 150.. బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ అవుతుంటే.. వాటితో పాటే తన శతమానం భవతిని విడుదల చేశాడు శర్వా. చిరు సినిమా ఇండస్ట్రీ హిట్.. బాలయ్యకు కెరీర్ బెస్ట్ వచ్చినా.. తను కూడా కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు దసరాకు ఎన్టీఆర్ జై లవకుశ.. మహేష్ స్పైడర్ వస్తున్నాయని తెలిసినా.. మహానుభావుడు మూవీ విడుదల చేసేశాడు.

అప్పుడు ఇతర చిత్రాలతో పాటు హిట్ కొడితే.. ఈసారి అదృష్టం మరింతగా కలిసొచ్చినట్లుగా ఉంది. వాటికి డివైడ్ టాక్.. శర్వా సినిమాకు సూపర్ టాక్ వచ్చేశాయి. అసలు తాను పోటీ పడనని.. రిలీజ్ డేట్ డిసైడ్ చేసేది నిర్మాతలే అంటూ వినయంగా చెబుతూనే.. సక్సెస్ వేలంపాటలో గెలుపుగుర్రాన్ని ఎగరేసుకుపోతున్నాడు శర్వానంద్
Tags:    

Similar News