రేటు బాగా పెంచేశావా రాజా!!

Update: 2016-03-09 05:40 GMT
టాలీవుడ్ లేటెస్ట్ రాజా శర్వానంద్. ఈ పేరుతో వచ్చిన రెండు సినిమాలతోనూ సక్సెస్ లు సాధించి, బాక్సాఫీస్ రాజా కూడా అయిపోయాడు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ కొట్టేయడంతో.. ఈయన రెమ్యూనరేషన్ విషయంలో గట్టిగానే పట్టుబడుతున్నాడని, రేటు బాగా పెంచాడనే టాక్ వినిపిస్తోంది.

శర్వా మాత్రం నిర్మాతలే తనకు రేటు పెంచి ఇస్తున్నారని, మార్కెట్ ప్రకారం వాళ్లే లెక్కలేసుకుని ఆఫర్ చేస్తున్నారని అన్నాడు. అయితే, ఇందులో పెద్దగా వాస్తవం లేదనే చెప్పాలిప్పుడు. తన పారితోషకం విషయంలో శర్వానంద్ కాస్త స్ట్రిక్ట్ గా ఉండాలనే డిసైడ్ అయ్యాడట. ప్రస్తుతం ఈ హీరో 3 కోట్ల దగ్గర ఊగిసలాడుతున్నాడని అంటున్నారు. ఎక్స్ ప్రెస్ రాజా కోసం శర్వానంద్ కు యూవీ క్రియేషన్స్ 2 కోట్ల రెమ్యూనరేషన్ చెల్లించింది. తమ తర్వాతి ఓ ప్రాజెక్ట్ కోసం శర్వాని అడిగితే.. రేటు విషయంలో పట్టు పట్టాడని అంటున్నారు.

యూవీ బ్యానర్ పై కొత్త సినిమాకి సైన్ చేసేందుకు శర్వా 3 కోట్లు అడగ్గా.. వాళ్లు 2.5 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చారని తెలుస్తోంది. అయితే, శర్వానంద్ మాత్రం కనీసం 2 కోట్ల 75 లక్షలైనా ఇస్తేనే సైన్ చేస్తానని తేల్చేశాడట. అంతేలెండి.. డిమాండ్ ఉన్నపుడే నాలుగు సినిమాలతో, నాలుగేసి కోట్లు చొప్పున వెనకేసుకోవాలి కదా.
Tags:    

Similar News