షాకింగ్‌: శ‌ర్వానంద్ ఎందుకు పెళ్లాడ‌లేదు?

Update: 2020-02-02 04:37 GMT
శ‌ర్వానంద్ - స‌మంత జంట‌గా న‌టించిన `జాను` ఈనెల‌లో రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్రీరిలీజ్ వేడుక‌లో శ‌ర్వా చెప్పిన ఓ సంగ‌తి ప్ర‌స్తుతం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ యువ‌హీరోలంతా పెళ్లి బంధంతో సెటిల‌వుతుంటే.. శ‌ర్వానంద్ ఇంకా ఎందుకు పెళ్లాడ‌లేదు? అన్న‌దానికి ఈ వేదిక‌పై స‌మాధానం దొరికింది. ఇంత‌కీ ఎందుకు పెళ్లాడ‌లేదు? అంటే ఇదిగో ఇదే స‌మాధానం.

వందలో తొంభై మందికి ప్రేమ‌లో వైఫ‌ల్యాలే ఎదుర‌వుతున్నాయి. అందులోనూ పదో క్లాస్‌లో లవ్ అంటే 99 పర్శంట్ వైఫ‌ల్యం త‌ప్ప‌దు. ఇటీవ‌ల‌ ఆరో తరగతి నుండి లవ్ లు మొదల‌వుతున్నాయి. 6 నుండి 80 ఏళ్ల వరకూ క‌నెక్ట‌య్యే ల‌వ్ ఎలిమెంట్ ఇది.  ఎందుకంటే.. జీవితంలో ఏది జరిగినా ఎన్ని లవ్ లు వచ్చినా.. ఫస్ట్ లవ్ ఫస్ట్ లవ్వే. ఈ సినిమా చూస్తున్నంత సేపూ... ఈ సీన్ నాది కదరా అని ఇన్వాల్వ్ అవుతారు. నా లవ్ స్టోరీ కూడా జాను లవ్ స్టోరీ లాంటిదే. అందుకే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు`` అంటూ షాకింగ్ రీజ‌న్ చెప్పాడు శ‌ర్వా. ఇక ఈ వేదిక‌పై శ‌ర్వా త‌న క‌థానాయిక‌ల గురించి చెబుతూ.. స‌మంత‌ గురించి చెప్పాలంటే.. త‌ను చాలా డేంజరస్. ఎందుకంటే చాలా మంది హీరోలకు పలానా హీరోయిన్ తో చేయాలంటే ఆలోచించుకుంటాం. ఎందుకంటే స్క్రీన్ మీద వాళ్లతో చేస్తున్నప్పుడు వాళ్లు బెటర్ పెర్ఫామెన్స్ తో తినేస్తారు. నిత్యా- సాయి పల్లవి- సమంత లాంటి హీరోయిన్లతో సినిమా అనగానే కొంచెం మనం అలర్ట్ అవ్వాలన్నమాట. అంటే వాళ్లను మించ‌లేం .. అయినా వాళ్లతో సమానంగా నటించాలి`` అని అన్నాడు.

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ప్రేమ వైఫ‌ల్యాల‌న్నీ తెర‌పై నిండుగా చూడొచ్చ‌ని శ‌ర్వా చివ‌రి మాట‌గా గ్యారెంటీ ఇచ్చాడు. అంతా బాగానే ఉంది కానీ.. త‌న స‌ర‌స‌న న‌టించిన స‌మంత మాత్రం డీప్ గా ల‌వ్ చేసి త‌న ప్రియుడినే పెళ్లి చేసుకుంది క‌దా! త‌న‌కు ఏ పాయింట్ క‌నెక్ట‌య్యిందో మాత్రం ఈ వేదిక‌పై స‌మాధానం దొర‌క‌నేలేదు. క‌నీసం రిలీజ్ ముందు మీడియా మీట్ల‌లో అయినా సామ్ ఆ ఒక్క ప్ర‌శ్న‌కు.. స‌మాధానం చెబుతుందేమో చూడాలి.



Tags:    

Similar News