ఇండిపెండెంట్ సినిమా కథతో శర్వా!

Update: 2019-08-21 13:52 GMT
'రణరంగం' తో థియేటర్స్ లో సందడి చేస్తున్న శర్వా 96 రీమేక్ చేస్తున్నాడు. దీంతో పాటు 'శ్రీకారం' అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇటీవలే సినిమా షూటింగ్ కూడా మొదలైంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాతో కిషోర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఈ సినిమా 'శ్రీకారం' అనే ఓ ఇండిపెండెంట్ సినిమాను ఆధారంగా తీసుకొని రూపొందిస్తున్నారట.

ఆ మధ్య కొత్తవాళ్ళతో కలిసి చిన్న ప్రయత్నంగా ఓ టీమ్ గంట నిడివి గల లఘు సినిమా చేసి రిలీజ్ చేశారట. ఇప్పుడు ఆ లఘు చిత్రాన్నే అటు ఇటుగా క మార్చి సినిమా కథగా మలిచి అదే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారట. అప్పట్లో ఆ ఇండిపెండెంట్ సినిమా ప్రీమియర్ కూడా వేసి తర్వాత యూ ట్యూబ్ లో కూడా పెట్టారట. కానీ ఎప్పుడైతే సినిమా చేద్దామని డిసైడ్ అయ్యారో అప్పుడే ఆ ప్రొడక్షన్ కి కొంత అమౌంట్ ఇచ్చి 14 రీల్స్ సంస్థ రైట్స్ తీసుకుందని తెలుస్తోంది. అందుకే ఇప్పుడా లెంగ్తీ షార్ట్ ఫిలింను యూ ట్యూబ్ లో కూడా తీసేసారట. ఇందులో ఒక మంచి సామాజిక అంశం ఉందట. అదే నిర్మాతలను, శర్వా ని ఇంప్రెస్ చేసిందని అంటున్నారు.

నిజానికి యూ ట్యూబ్ వ్యూస్ కోసం కొందరు కొత్త దర్శకులు చేసే ప్రయత్నాలు సినిమా మేకర్స్ ను సైతం ఆకర్షిస్తాయి. శ్రీకారం ఆ కోవలోకే వస్తుంది. దర్శకుడు కిషోర్ చేసిన ఆ ప్రయత్నానికి ఇప్పుడు అదే కథతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. మరి ఈ ఇండిపెండెంట్ సినిమాతో శర్వా ఎలాంటి హిట్ సాదిస్తాడో.
Tags:    

Similar News