సామ్ తో నటించాలంటే పోటీపడాలి! అదో ఛాలెంజ్ లాంటిది!! అంటూ బహిరంగంగానే ఒప్పుకున్నాడు శర్వానంద్. అతడిలోని నిజాయితా బావుంది కానీ... ఇంతకీ సామ్ ని మించి నటించాడా? ఛాలెంజ్ లో నెగ్గుకొస్తాడా? అన్నదే ఇప్పుడు సస్పెన్స్.
తమిళ బ్లాక్ బస్టర్ 96 ని తెలుగులో జాను టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. మాతృక దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ ని తెరకెక్కించారు. ఇందులో విజయ్ సేతు పతి పాత్రలో శర్వానంద్.. త్రిష పాత్రలో సమంత నటించారు. ఇదొక కల్ట్ క్లాసిక్ మూవీ. నాయకానాయికల పాత్రలు ఎంతో రియలిస్టిక్ గా అనిపిస్తాయి. సినిమా చూస్తున్నంతసేపు రియల్ లైఫ్ లో అలాంటి అనుభవాలుంటే కచ్చితంగా కళ్ల ముందు మొదులుతాయని తమిళ్ క్రిటిక్స్ సమీక్షల్లోనూ పేర్కొన్నారు.
అయితే జాను స్క్రిప్ట్ తో దిల్ రాజు సమంతని అప్రోచ్ అయినప్పుడు ముందుగా నటించనని తిరస్కరించిందిట. మళ్లీ మళ్లీ వెంటపడుతూ రాజు గారు పట్టుబట్టడంతోనే అంగీకరించానని ఇటీవల సమంత వెల్లడించింది. మరి కల్ట్ క్లాసిస్ సినిమాకు సమంత ఎందుకని నో చెప్పింది? అంటే.. దానికి ఆసక్తికర కారణం ఉందని చెప్పుకొచ్చింది. ఇందులో హీరోయిన్ పాత్ర చాలా ఠఫ్ గా..ఛాలెంజింగ్ గా ఉంటుందని అందుకే నో చెప్పిందట. కానీ రెండవ సారి ఎస్ చెప్పి ఒక మంచి పని చేసానని సంబరపడింది. ఈ రోల్ మిస్ అయితే.. మళ్లీ ఇలాంటి పాత్ర దక్కేది కాదని.. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి కథలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయని అంది.
అలాగే ఈ సందర్భంగా.. దిల్ రాజుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. జాను ఒక క్లాసీ రీమేక్ అయినా తెలుగు ఆడియెన్ కి సరికొత్త ఫీల్ ను అందిస్తుందని...ఒరిజినల్ వెర్షన్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చింది. అలాగే శర్వానంద్ సమంత పాత్రని..అందులో ఆమె నటనని ఆకాశానికి ఎత్తేసాడు. ఇక ఇందులో సామ్ తో పోటీపడి నటించాల్సి వచ్చిందని శర్వా అన్నాడు. మరి జానులో శర్వా ఏ స్థాయిలో పోటీ పడి నటించాడన్నది చూడాల్సి ఉంది.