కొన్ని సినిమాలు అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్ గా రాసి పెట్టి ఉన్న హీరో చేతిలో పడటం సహజమే. లేటెస్ట్ గా శర్వానంద్ కి అలాంటిదే జరిగింది. చెన్నై వెళ్లి '96' రీమేక్ రైట్స్ అందుకున్న దిల్ రాజు తెలుగులో రీమేక్ చేసేందుకు చాలానే కష్టపడ్డాడు. ముందుగా క్యాస్టింగ్ దగ్గర పెద్ద సవాలు ఎదుర్కున్నాడు. నాని తో పాటు మరికొందరికీ స్క్రీనింగ్ వేసి సినిమా చేయాలంటూ అడిగాడు.
కానీ సినిమా చూసిన కుర్ర హీరోలెవరూ ఆ సాహసం చేయలేకపోయారు. ముఖ్యంగా నాని అయితే నా వల్ల కాదు అసలు ఇది రీమేక్ చేయకపోవడం బెటర్ అన్నట్టుగా చెప్పేశాడట. దీంతో అయోమయంలో పడ్డ దిల్ రాజు కొన్ని రోజులు మరో హీరో గురించి ఆలోచిస్తూ ఉండిపోయారట. ఇక ఫైనల్ గా శర్వా ను అడిగి తనకు ఇష్టం లేకపోయినా పట్టుబట్టి ఒప్పించి సినిమా చేసాడు. మరో వారం రోజుల్లో సినిమా థియేటర్స్ లోకి కూడా వచ్చేస్తుంది.
అయితే నిజానికి తమిళ్ లో తెరకెక్కిన ఈ క్లాసిక్ సినిమాను టచ్ చేయడానికి ఏ హీరో ముందుకు రాలేదు. కానీ శర్వా ఒక్కడే దిల్ రాజు మీద నమ్మకం ఉంచి సినిమా చేసాడు. గతంలో 'శతమానం భవతి' కి కూడా ఇదే జరిగింది. ఆ కథను ముందుగా సాయి ధరం తేజ్ లేదా రాజ్ తరుణ్ తో తీయలనుకున్నారు. ఫైనల్ గా ఆ బ్లాక్ బస్టర్ శర్వా కి రాసిపెట్టి ఉన్నట్టైంది. ఇప్పుడు జాను కూడా సూపర్ హిట్ అయితే ఈ సినిమా ఎందుకు మిస్సయ్యమా అంటూ కుర్ర హీరోలు భాద పడటం కామనే.