జంధ్యాల.. ఈవీవీ.. ఇప్పుడు మారుతి

Update: 2017-09-27 04:49 GMT
యంగ్ హీరో శర్వానంద్ నటించిన మహానుభావుడు ఎల్లుండే థియేటర్లలోకి వస్తోంది. జై లవకుశ స్పైడర్ అంటూ టఫ్ కాంపిటీషన్ ఉన్నా.. తన అలవాటు ప్రకారం పండుగకు ఆ రేసు మధ్యలోనే వచ్చేస్తున్నాడు శర్వా. తమ మూవీ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టెయినర్ అంటున్న శర్వా.. మహానుభావుడు ఏ చిత్రానికి పోటీ కాదని చెబుతున్నాడు.

"అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ తో ఉన్న వ్యక్తి తన జీవితంలోను.. ప్రేమ కోసం ఎన్నేసి కష్టాలు పడ్డాడన్నదే ఈ మూవీ. ఒక వ్యాధి అనగానే చాలామంది భలేభలే మగాడివోయ్ చిత్రంతో పోలిక పెడుతున్నారు కానీ.. దానికి దీనికి సంబంధం ఉండదు. కనీసం కాన్సెప్ట్ కూడా మ్యాచ్ కాదు. రియల్ లైఫ్ లో నేనేమీ అంత పరిశుభ్రంగా ఉండను. అంతో ఇంతో క్లీన్ గా ఉంటాను కానీ. మరీ ఆ కేరక్టర్ అంత మాత్రం కాదు. మహానుభావుడికి తమన్ ఇచ్చిన సంగీతం సూపర్బ్ గా వచ్చింది. దర్శకుడు మారుతి కొన్ని అద్భుతమైన లొకేషన్స్ లో పాటలను తెరకెక్కించారు. ఆన్ స్క్రీన్ పై ఈ పాటలు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి" అంటున్నాడు శర్వానంద్.

"పోటీ మధ్యలో రిలీజ్ చేసినంత మాత్రాన మా మూవీకి నష్టం ఉంటుందని అనుకోను. నా కెరీర్ లో ఇది ఒక బెస్ట్ ఫిలింగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ఇక దర్శకుడి విషయానికి వస్తే.. మారుతి సూపర్ అంతే. జంధ్యాల.. ఈవీవీ లాంటి వారు అద్భుతంగా కామెడీ పండించగలరు. మారుతి కూడా అదే స్టైల్ రేంజ్ ఉన్న డైరెక్టర్. తను కామెడీ డీల్ చేసిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది" అంటూ మూవీ సంగతులు చెబుతున్నాడు శర్వా.
Tags:    

Similar News