ఫిదాలో భానుమతిగా అల్లరితో ఆకట్టుకున్న మలయాళీ బ్యూటీ సాయి పల్లవి తెలుగులో హడావిడి పడి ఎక్కువ సినిమాలు చేసేయడం లేదు. కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తనకు ప్రాధాన్యం ఉన్న వాటినే ఏరికోరి మరీ ఒప్పుకుంటోంది. ఆ మధ్య ఒక అప్ కమింగ్ హీరో సరసన చేయడానికి రెండు కోట్ల ఆఫర్ ఇస్తే పాత్ర మరీ రొటీన్ గా ఉందని తిరస్కరించినట్టు ఫిలిం నగర్ లో పెద్ద చర్చే జరిగింది. నానితో ఎంసిఎ తర్వాత కణం అనే డబ్బింగ్ సినిమాలో మాత్రమే కనిపించిన సాయి పల్లవి ఆ తర్వాత మళ్ళి పడి పడి లేచే మనసుతో డిసెంబర్ లో కనిపించనుంది.
సాధారణంగా సాయి పల్లవి మీద సెట్స్ లో హీరోలతో ప్రవర్తన గురించి గతంలో చాలా రకాల కథనాలు వచ్చేవి. హీరో నానితో దిల్ రాజుతో గొడవ పడినట్టు ఎంసిఎ షూటింగ్ టైంలో చాలా గాసిప్స్ హల్చల్ చేశాయి. వాటిని నాని తర్వాత కొట్టి పారేసాడు. కానీ కణంలో సాయి పల్లవితో నటించిన నాగ శౌర్య మాత్రం ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో తన మీద కాస్త ఘాటు ఆరోపణలే చేసాడు. అవేవి లేవని ప్రీ రిలీజ్ లో సాయి పల్లవి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వాటికి తెరపడలేదు. ఇప్పుడు పడి పడి లేచే మనసులో శర్వానంద్ తో ఏమైనా ఇష్యూస్ వస్తాయేమో అని ఎదురు చూశాయి కొన్ని వర్గాలు. కానీ శర్వానంద్ మాత్రం అబ్బే అలాంటిది ఏమి లేదు సాయి పల్లవి ఈజ్ ఏ గుడ్ గర్ల్ అంటూ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాడు.
స్క్రిప్ట్ ని బాగా అర్థం చేసుకుని నటించే హీరోయిన్స్ లో సాయి పల్లవికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వొచ్చని చెప్పిన శర్వా తనకు ఇంటెలిజెంట్ యాక్టర్ అనే బిరుదు కూడా ఇచ్చేసాడు. ఒకవేళ తన మనసులో ఏదైనా నెగటివ్ గా ఉంటే స్మార్ట్ గా తప్పించుకునే అవకాశం ఉన్నా శర్వా ఇంత ఓపెన్ గా చెప్పాడు అంటే నిజమే అయ్యుంటుంది. డిసెంబర్ 21న విడుదల కానున్న పడి పడి లేచే మనసు షూటింగ్ ఫైనల్ స్టెప్ వద్ద ఉంది. దీంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేసేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ మూవీ మీద యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి