ఒక సినిమా రిలీజైనప్పుడు దాని రిజల్టు కారణంగా సదరు హీరోకు ఎంత ఆనందంగా ఉంటుందో.. ఆ ప్రాజెక్టును మిస్ చేసుకున్న హీరోకు కూడా అంతే జిల్ అంటుంది. అదిగో ఇప్పుడు టాలెంటెడ్ కుర్రాడు శర్వానంద్ పరిస్థితి అలాగే ఉంది. మనోడు ఏమాత్రం జాగ్రత్తపడినా కూడా ఒక మాంచి హిట్టును తన ఖాతాలో వేసుకునేవాడు. కాని ఇక్కడ అలా జరగలేదు.
అసలు జెంటిల్మన్ సినిమా కథను మొదటిగా శర్వానంద్ కే వినిపించాడట దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఈ సినిమాను శర్వాతో తీయాలనే మనోడు ఆలోచనంతా. పైగా గతంలో ఓ రెండు సినిమాల్లో కాస్త నెగిటివ్ గా ఉంటే ఎలా ఉంటుందో చూపించిన శర్వానంద్.. జెంటిల్మన్ సినిమాలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రను ఈజీగానే చేసేశేవాడు. కాకపోతే ఇంద్రగంటి రాసిన కథలో నెగెటివ్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయని అనుకున్న శర్వా.. ప్రాజెక్టును రిజక్టు చేయడంతో.. అది నాని చేతుల్లో పడింది. తొలిరోజునే 3.19 కోట్లు షేర్ వసూలు చేసి ప్రకంపనలు సృష్టించింది.
అందుకే శర్వా ఇప్పుడు తను విన్న కథలన్నింటినీ జాగ్రత్తగా రెండోసారి కూడా విని.. అప్పుడే నిర్ణయం తీసుకోవాలని ఫిక్సయ్యాడట. అలా చేస్తేనే మాంచి మాంచి ప్రాజెక్టులు మిస్సవ్వకుండా ఉంటాయనేది మనోడి ఫీలింగ్. సర్లే శర్వా.. సినిమాల్లో ఇలాంటివన్నీ కామనే!!