యంగ్ హీరో శర్వానంద్ ఇప్పుడు మంచి స్పీడ్ మీదే ఉన్నాడు. వరుస విజయాలు.. శతమానం భవతితో సాధించిన బ్లాక్ బస్టర్ తర్వాత.. సమ్మర్ లో వచ్చిన రాధ.. స్పీడ్ బ్రేకర్ అనుకోవచ్చు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా.. ఆడియన్స్ కానీ ఇండస్ట్రీ కానీ పెద్దగా పట్టించుకుంటున్నట్లుగా కనిపించలేదు. ఇప్పుడు తన తర్వాతి సినిమా కోసం కూడా భారీ టార్గెట్ నే సెట్ చేసుకున్నాడు శర్వానంద్.
రెమ్యూనరేషన్ కు బదులుగా ఓవర్సీస్ రైట్స్ తీసుకోవడం అనే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు శర్వా. రాధ చిత్రానికి కూడా ఇలాగే చేశాడు. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న మహానుభావుడు మూవీకి కూడా ఇదే ఫాలో అయ్యాడట. ఇప్పుడీ సినిమాకి ఓవర్సీస్ డీల్ పూర్తయిపోయిందని తెలుస్తోంది. శర్వా ట్రాక్ రికార్డ్.. క్లాస్ ఆడియన్స్ లో ఉన్న ఫాలోయింగ్ చూసి.. ఈ సినిమాను 3.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారట అక్కడి డిస్ట్రిబ్యూటర్స్. అంటే.. ఈ అమౌంట్ శర్వా ఖాతాలోకి వెళుతుందన్న మాట. దాదాపు 10 కోట్లకు అటూ ఇటుగా బడ్జెట్ తో రూపొందే సినిమాకి ఇంత మొత్తం పారితోషికం అంటే పెద్ద విషయమే.
అయితే.. ఈ సినిమా ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ కు రావాలంటే.. కనీసం మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. మహానుభావుడు ఎంటర్టెయినర్ జోనర్ లో రూపొందడం.. అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న మారితి దర్శకత్వంలో రూపొందడంతో.. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర శర్వాకు ఇది పెద్ద టార్గెట్ కాకపోవచ్చనే అంచనాలున్నాయి. మొత్తంమీద సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు శర్వానంద్.