చిరంజీవిగారి స్థాయి చరణ్ కి మాత్రమే ఉంది .. ఇంకెవరికీ అది దక్కదు: శర్వానంద్
తెలుగులో రైతుల సమస్యల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అయితే రైతుల సమస్యలను టచ్ చేస్తూ .. పరిష్కార మార్గాలను సూచిస్తూ రూపొందిన చిత్రంగా 'శ్రీకారం' కనిపిస్తుంది. గ్రామీణ జీవనంలోని అందాన్నీ .. ఆనందాన్ని . అనుబంధాలను ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారనే విషయం ట్రైలర్ ద్వారా అర్థమైపోయింది. కిశోర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ ఆచంట - గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ముఖ్య అతిథిగా నిన్న రాత్రి 'ఖమ్మం'లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది.
ఈ సినిమాలో కథానాయకుడిగా నటించిన శర్వానంద్ మాట్లాడుతూ .. "ఈ సినిమాకి చిరంజీవిగారు ముఖ్య అతిథిగా రావడం నేను చేసుకున్న అదృష్టం. మా అందరికీ ఆయన బాస్ .. ఆయన ముందు ఇంతవరకూ మాట్లాడింది లేదు .. అందుకే చాలా టెన్షన్ .. టెన్షన్ గా ఉంది. ఆయన ముందు మాట్లాడే అవకాశం కూడా మళ్లీ మళ్లీ రాదు. అందుకే ఏం మాట్లాడాలనేది ముందుగానే రాసేసి పెట్ట్టుకున్నాను. తొలిసారిగా నేను విజయానికి 'శ్రీకారం' చుట్టింది చిరంజీవిగారి 'శంకర్ దాదా' సినిమాతోనే. ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్టుగా ఆయన రావడానికి అంగీకరించిన రోజునే మేము సగం సక్సెస్ అయ్యాము.
చాలాకాలం క్రితం చిరంజీవిగారు నాకు ఒక మాట చెప్పారు .. "శర్వా .. నీ సంకల్పం గొప్పదైతే దేవుడు నీ తల రాతను తిరగరాస్తాడు"అని. ఇప్పటికీ ఆ మాట నాకు గుర్తుంది .. ఆ మాటను తలచుకుంటూనే షూటింగులకు వెళుతూ ఉంటాను. ఆ సంకల్ప బలం వల్లనే ఈ రోజున ఇక్కడ నిలబడి మాట్లాడే అర్హత నాకు వచ్చిందని నేను భావిస్తున్నాను. చిరంజీవిగారు ఆ రోజున చెప్పిన ఆ మాటనే నన్ను స్టార్ ను చేసింది. అందుకు నేను ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను.
ఇక ఈ సమయంలో గుర్తుచేసుకోవలసిన మరో వ్యక్తి ఉన్నాడు .. ఆయనే నా మిత్రుడు రామ్ చరణ్. ట్రైలర్ రిలీజ్ కాగానే నాకు కాల్ చేసి, ఈ సినిమా తప్పకుండా బాగా ఆడుతుందని చెప్పాడు. ఏ సపోర్టు కావాలన్నా చెప్పు .. నేను చేస్తాను అన్నాడు. ఇంతమంచి సినిమాను ఎలాగైనా ప్రమోట్ చేయాలని తను చిరంజీవి గారికి కాల్ చేసి చెప్పినప్పుడు నా ఆనందానికి అంతులేదు. చాలామందికి వారసత్వమనేది ప్రోపర్టీస్ ద్వారా మాత్రమే వస్తుంటుంది. కానీ వ్యక్తిత్వం విషయంలోను చిరంజీవిగారి వారసత్వం చరణ్ కి వచ్చింది. ఆ స్థాయి ఎవరికీ దక్కదు .. ఒక్క చరణ్ కి మాత్రమే అది సొంతం" అని చెప్పుకొచ్చాడు.