తమిళంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న మూవీ ‘96’. ఈ ఏడాది టాప్ చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా నిలిచింది. విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు పూర్తి విభిన్నంగా తెరకెక్కింది. స్కూల్ డేస్ లో ప్రేమించుకున్న అమ్మాయి, అబ్బాయి విడిపోయి చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ స్కూల్ స్నేహితుల గెట్ టు గెదర్ లో కలుస్తారు. ఆ సమయంలో వారి మనోగతం - గత అనుభవాలు - సంతోషాలు అన్ని నెమరేసుకుంటూ ఉంటారు - తెలుగు ప్రేక్షకులకు అభిరుచికి కాస్త దూరంగా ఈ చిత్రం ఉంటుందని అనిపిస్తుంది. అయినా కూడా దిల్ రాజు ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.
పలువురు హీరోల వద్దకు ఈ చిత్రం వెళ్లింది. అల్లు అర్జున్ - గోపీచంద్ ఇంకా ఇద్దరు ముగ్గురు హీరోలు కూడా ఈసినిమాను చూశారనే వార్తలు వచ్చాయి. తాజాగా ‘96’ మూవీకి హీరో ఫిక్స్ అయ్యాడనే అనిపిస్తుంది. శర్వానంద్ తాజాగా 96 మూవీపై ఒక క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని - త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని చెప్పుకొచ్చాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా - స్క్రిప్ట్ ను మార్చితే శర్వా ఒప్పుకునే అవకాశం ఉందట.
ప్రస్తుతం ‘పడి పడి లేచె మనసు’ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా మీడియాతో మాట్లాడేస్తున్న శర్వానంద్ 96 మూవీ రీమేక్ పై క్లారిటీ ఇచ్చాడు. తమిళంలో క్లాసిక్ మూవీగా నిలిచిన ఆ సినిమా తెలుగులో రీమేక్ చేయడం అంటే చాలా పెద్ద ప్రయోగమే. పాటలు - రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు కనుక ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది చెప్పలేం. అయినా కూడా ఒక మంచి సినిమా చేశామనే ఫీలింగ్ కోసం ఈ రీమేక్ కు శర్వా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. పడి పడి లేచె మనసు చిత్రం తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో దళపతి అనే చిత్రంలో శర్వా చేస్తున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది వేసవి తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ 96 మూవీ ఖరారు అయితే వచ్చే ఏడాది వేసవికి ముందే షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.