శర్వానంద్ స్ట్రాటజీయే వేరు..

Update: 2017-08-16 17:30 GMT
అంతా అనుకున్న ప్రకారం జరిగితే నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘పైసా వసూల్’ సెప్టెంబరు 29నే రావాల్సింది. కానీ సినిమా ముందే రెడీ అయిపోవడమే కాక.. ‘స్పైడర్’ సెప్టెంబరు 27కు ఫిక్స్ కావడంతో రిస్క్ ఎందుకని ముందుకు తీసుకొచ్చేశారు. సెప్టెంబరు 1నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేస్తున్నారు. భారీ బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కాబట్టి పోటీ ఎందుకనుకోవడం మంచి ఆలోచనే దీన్ని భయపడ్డట్లుగా ఏమీ భావించనక్కర్లేదు. ఐతే ‘పైసా వసూల్’ లాంటి పెద్ద సినిమానే వెనక్కి తగ్గితే.. శర్వానంద్ కొత్త సినిమా ‘మహానుభావుడు’ను ‘స్పైడర్’కు పోటీగా దించాలనుకోవడం ఏంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఐతే శర్వానంద్ ఇంతకుముందు గత రెండు సంక్రాంతి పండగలకూ భారీ సినిమాల మధ్య తన చిత్రాల్ని పోటీలో నిలిపాడు. పోయినేడాది ‘నాన్నకు ప్రేమతో’.. ‘డిక్టేటర్’.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి పెద్ద సినిమాల పోటీని తట్టుకుని ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సూపర్ హిట్టయింది. ఈ ఏడాది ‘ఖైదీ నంబర్ 150’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాల్ని ఢీకొట్టి ‘శతమానం భవతి’ బ్లాక్ బస్టర్ అయింది. ఐతే అన్నిసార్లూ అలాంటి మ్యాజిక్కే రిపీటవుతుందా.. సంక్రాంతి సీజన్లో సినిమాలకుండే ఆదరణ ఇప్పుడుంటుందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఐతే దసరా సీజన్ కు కూడా సెలవులుంటాయి కాబట్టి జనాలు థియేటర్లకు రావడం గురించి సందేహించాల్సిన పని లేదు. దసరా సమయానికి పోటీలో ఉన్నది ఒక్క ‘స్పైడర్’ మాత్రమే. దాని ఓవర్ ఫ్లోస్ ఇటు మళ్లినా ‘మహానుభావుడు’కు ఓపెనింగ్స్ విషయంలో ఢోకా ఉండదు. ఒకవేళ ‘స్పైడర్’ రిజల్ట్ విషయంలో తేడా కొడితే ఇక ‘మహానుభావుడు’ పంట పండినట్లే. ‘పైసా వసూల్’ పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి టార్గెట్లు పెద్దగా ఉంటాయి. కానీ ‘మహానుభావుడు’ బడ్జెట్ తక్కువ కాబట్టి సేఫ్ జోన్లోకి రావడానికి మంచి అవకాశాలే ఉంటాయి. సినిమా చెత్తగా ఉంటే తప్ప దీనికి పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు.
Tags:    

Similar News