ఫోటో స్టొరీ: షిబాని బికిని కహాని

Update: 2018-09-07 10:54 GMT
కథలు కాకరకాయలు అని తెలుగులో ఒక పదప్రయోగం ఉంది.  కథలు అంటే నాన్న-పులి.. నాన్న-పప్పు లాంటివి.  'నాన్నా-పప్పు' నాకు తెలీదని.. నేను వినలేదని మీరంటే ఎలా కుదురుతుంది? న్యూస్ నిండా అవే స్టోరీలు కదా.  అవన్నీ కనుక కథలు అనుకుంటే మరి కాకరకాయలేవి?  మనం రోజూ మాట్లాడుకునే ఫోటో స్టోరీలు.. కాకరకాయలు అంటే చేదుగా ఉంటాయని అనుకోవద్దు.  చేదులో కూడా ఒకరకమైన మాధుర్యం ఉంటుంది. అది చేదు గురించి తెలిసిన వాడికి మాత్రమే తెలుస్తుంది. 

ఇక ఇలాంటి అర్థం కాని విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా ఇప్పుడు షిబాని దండేకర్ గురించి మాట్లాడుకుందాం. బాలీవుడ్ మీడియాను ఫాలో అయ్యే వారికి ఈ పేరు ఇప్పటికే తెలిసి ఉంటుంది.  మల్టి టాలెంటెడ్ సెలబ్రిటీ ఫర్హాన్ అఖ్తర్ రెండేళ్ళ కిత్రం తన వైఫ్ అధున కు విడాకులు ఇచ్చాడు.  ఈమధ్య ఈ షిబానిని డీప్ గా లవ్ చేసున్నాడట.. ఆవిడ కూడా అఖ్తర్ ని అరమరికలు లేకుండా ప్రేమిస్తోందట.  వీళ్ళు కూడా జంటగా ఫోటోలు దిగుతూ తమ రిలేషన్ గురించి స్లో గా హింట్స్ ఇస్తున్నారు.  ఇక ఈ షిబాని మోడల్ కమ్ టీవీ హోస్ట్. AXN ఛానల్ లో ప్రసారమైన 'మెన్ 2.0' దగ్గరనుండి మొదలు పెడితే హిందీ ప్రోగ్రాములకు కూడా హోస్ట్ గా పనిచేసింది.  IPL కూడా ఈ సుందరి హోస్ట్.

చాలామంది బ్యూటీల లాగానే ఈమె ఇన్ స్టాగ్రామ్ తాట తీయడంలో దిట్ట. వన్ మిలియన్ కు పైగా ఫాలోయర్లు ఉన్నారు. హాటు హాటు ఫోటోలతో రచ్చ చేస్తుంది. తాజాగా వైట్ మొనోకిని(సింగిల్ పీస్ ఉంటే బికిని అనరు.. మొనోకిని అంటారు)లో ఖజురహో శిల్పంలా పోజిచ్చింది. కాస్త చిందరవందరగా ఉన్న జుట్టు పై వయ్యారంగా చెయ్యిపెట్టుకొని కళ్ళు మూసుకొని ఒక సెన్సువల్  ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.  మరి ఏం టాలెంట్ లేకుండా అఖ్తర్ సాబ్ ఊరికే ఫిదా ఆవుతారా?


Tags:    

Similar News