అశ్లీల చిత్రాలను నిర్మించిన కేసులో ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరిచారు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జూలై 23 వరకు కోర్టు పోలీసు కస్టడీకి పంపింది. 45 ఏళ్ల కుంద్రాపై నమోదైన కేసు అశ్లీల వీడియోలు తీయడం.. కొన్ని యాప్‌ల ద్వారా పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ మొత్తం అశ్లీల రాకెట్ వెనుక ఉన్నది రాజ్ కుంద్రా బంధువు.. యూకే పౌరుడౌన బక్షి అని సమాచారం. కుంద్రా సోదరిని వివాహం చేసుకున్న బక్షి బ్రిటన్ లోని లండన్ లో ఉంటున్నాడు. ఈయన కెన్రిన్ లిమిటెడ్ చైర్మన్ గా ఉన్నాడు.
కెన్నిన్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ‘హాట్ షాట్స్ డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్’ అనే మొబైల్ యాప్ ను రాజ్ కుంద్రాతో కలిసి బక్షి సంయుక్తంగా నిర్వహిస్తున్నారని ముంబై జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) మిలింద్ భరంబే తెలిపారు.
హాట్ షాట్ ల యాప్ ను ప్రపంచంలోని 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా డౌన్ లోడ్ చేసుకొని వాడేలా రూపొందించారు. ఇందులో ప్రపంచంలోనే ప్రత్యేకమైన హాటెస్ట్ మోడల్స్, షార్ట్ ఫిల్మ్ లు, హాట్ వీడియోలను ప్రదర్శిస్తారు. ఇది ఒక సాఫ్ట్ అశ్లీల యాప్ గా రూపొందించినట్టు తెలుస్తోంది.
ముంబై చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా మారాలని వచ్చే అమాయక, నిరుపేద బాలికలను ఈ పనిలో ఇరికించినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద సినిమాల్లో పనిచేయిస్తామనే నెపంతో బాలికలను బలవంతంగా ఈ అశ్లీల సినిమాల్లో చేయించేవారని తెలిసింది. అలా బూతు సినిమాలను మొబైల్ యాప్, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేసి లక్షలు సంపాదించేవారని తెలిసింది.
ముంబైలోని మలాద్ వెస్ట్ లోని మాధ్ గ్రామంలో అశ్లీల చిత్రాలను చిత్రీకరించిన బంగ్లా అద్దెకు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఏపీఐ లక్ష్మీకాంత్ సులుఖే ఆ బంగ్లాపై దాడి చేసినప్పుడు అశ్లీల చిత్రం షూటింగ్ జరుగుతోంది.
ఈ అశ్లీల వ్యాపారం యూకే నుంచి నడుస్తున్నప్పటికీ ఈ పోర్న్ చిత్రాల కార్యకలాపాలు, చిత్రీకరణ భారతదేశంలో రాజ్ కుంద్రా సంస్థ ద్వారా జరుగుతోందని పోలీసులు తేల్చారు. ఈరోజు పోలీసులు విచారణ జరపగా.. నటి శిల్పాశెట్టికి తన భర్త చేసిన ఈ కార్యకలాపాలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇక జనవరిలో రాజ్ కుంద్రా బ్యాంక్ ఖాతాకు ఒక పెద్ద లావాదేవీ జరిగినట్టు పోలీసులు తేల్చారు. పోలీసులు ఫిబ్రవరి 2021లో కేసు నమోదు చేసి చివరకు అతడిని అరెస్ట్ చేశారు.
హిందీ పరిశ్రమకు చెందిన కొందరు పెద్ద సెలబ్రెటీలను ఈ అశ్లీల సినిమాల కోసం వాడుకోవడానికి రాజ్ కుంద్రా ప్రణాళికలు చేసినట్టుగా తేలింది. ఈ విషయమై అతడు ఇబ్బందుల్లో పడ్డాడు.
ఇక గతంలో కూడా కొన్నేళ్ల ఐపీఎల్ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ ఆరోపణలతో ఇప్పటికే రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యారు.ఇప్పుడు మరో కేసులో బుక్కయ్యాడు. రాబోయే రోజుల్లో అతడి కేసు ఎలా ముందుకు సాగుతుందనేది ఆసక్తి రేపుతోంది.