భ‌ర్త కుంద్రా కేసుల‌తో శిల్పాశెట్టికి కోట్లలో న‌ష్టం

Update: 2022-08-01 02:30 GMT
నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా జూలై 19న అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో అరెస్టయ్యారు. కుంద్రా వియాన్ ఇండస్ట్రీస్ తో టై-అప్ కలిగి ఉన్న UK ఆధారిత కంపెనీ యాజమాన్యంలో ఉన్న హాట్ షాట్స్ అనే యాప్ లో అశ్లీల కంటెంట్ ను రూపొందించి ప్రచురించినట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి. కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా ఈ కేసులో శిల్పాశెట్టి ప్రమేయంపై ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ విచారణ జరుపుతోంది. ఆమెను రెండుసార్లు విచారించినా పోలీసులకు ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు.

2021 జూలై 23న త‌మ‌ ఇంట్లో జరిగిన పోలీస్ దాడికి శిల్పాశెట్టి తీవ్ర క‌ల‌త‌కు గుర‌య్యారు. తన భర్తను ఇలా అరెస్టు చేయాల్సిన అవ‌స‌రం ఏం ఉంటుంద‌ని..? ఆందోళ‌న చెందారు. అరెస్టు తర్వాత మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు శిల్పా రాజ్ తో మాట్లాడుతూ.. ``మ‌న‌ దగ్గర అన్నీ ఉన్నాయి.. ఇవన్నీ చేయవలసిన అవసరం ఏమిటి?`` అని ప్ర‌శ్నించిందని క‌థ‌నాలొచ్చాయి. ముంబై మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. శిల్పా తన భర్తను చూడగానే విరుచుకుపడింది. కుటుంబం పరువు పోయింది.. పరిశ్రమలో వారి ఎండార్స్ మెంట్ లు రద్ద‌వుతున్నాయి. చాలా ప్రాజెక్ట్ లను వదులుకోవాల్సి వచ్చింది`` అని చెప్పింది. ఆర్థిక నష్టాల గురించి కూడా ఆమె క‌ల‌త చెందిన‌ట్టు సమాచారం.

ఇంతలోనే డ్యాన్స్ రియాలిటీ షో `సూపర్ డ్యాన్సర్ చాప్టర్ 4` లో న్యాయనిర్ణేతలలో ఒకరైన శిల్పాశెట్టి.. రాజ్ కుంద్రాను అరెస్టు చేసినప్పటి నుండి షూట్ కు దూరంగా ఉన్నారు. ఆమె లేనప్పుడు ఒక ఎపిసోడ్ కి త‌న‌ స్థానంలో కరిష్మా కపూర్ ని తీసుకున్నారు. మునుముందు ఎపిసోడ్ లో రితీష్ దేశ్ ముఖ్ - జెనీలియా దేశ్ ముఖ్ ప్రత్యేక అతిధులుగా రానున్నారు. షో నుండి శిల్పాను తొలగించారనే ఊహాగానాలు వినిపిస్తుండగా.. ఛానెల్ అలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా క‌థ‌నాలొచ్చాయి. నిజానికి ఈ కేసు సద్దుమణిగిన తర్వాత శిల్పా నెల రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నా రాలేక‌పోయింది. అయితే త‌ను లేనప్పుడు దాదాపు రూ.2 కోట్ల మేర‌ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ డ‌బ్బును స‌ద‌రు చానెల్ శిల్పా శెట్టికి చెల్లించ‌దు. షోలో అత్యధిక పారితోషికం పొందిన జడ్జిగా శిల్పా  ఒక్కో ఎపిసోడ్ కు రూ.18-22 లక్షలు అందుకుంటోంది. ప్రతి వారం రెండు ఎపిసోడ్ లు ప్రసారం అవుతుండటంతో దాదాపు రూ. 2 కోట్ల మేర శిల్పాజీ నష్ట‌పోయింద‌ని అంచ‌నా.

కుంద్రా అరెస్ట్ ఘ‌ట‌న అనంత‌రం తదుపరి మూడు వారాల్లో తిరిగి షో జ‌డ్జిగా రాగలిగితే కొంతవ‌ర‌కూ రిక‌వ‌రీ తిరిగి రావొచ్చు. కానీ అశ్లీలత కేసులో ప్రతిరోజూ కొత్త పరిణామాలు బ‌య‌ట‌ప‌డ‌డంతో  ఈ కేసును పొడిగించే అవకాశం ఉందని ముంబై మీడియాలు క‌థ‌నాల్ని వెలువ‌రించాయి. దాంతో శిల్పాను ఎక్కువ కాలం లైమ్ లైట్ కు దూరం గా ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని తేలింది.

మరోవైపు కుంద్రా అరెస్ట్ అయిన వారంలోనే శిల్పా న‌టించిన హంగామా విడుద‌ల కావ‌డం యాధృచ్ఛికం. 14 ఏళ్ల తర్వాత శిల్పాశెట్టి మళ్లీ తెరపైకి వచ్చిన అరుదైన ఘ‌ట‌న ఇది. జూలై 23న డిస్నీ+ హాట్ స్టార్ లో విడుదలైన ప్రియదర్శన్ చిత్రం `హంగామా 2`తో శిల్పాజీ తిరిగి వచ్చింది. అదే రోజు పోలీసులు ఆమె జుహు బంగ్లాలో సోదాలు నిర్వహించారు. ఆమెను ఆరు గంటల పాటు ప్రశ్నించారు. అరెస్ట్ తర్వాత ఆమె సినిమాల‌కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. గ‌డిచిన ఏడాది శిల్పా శెట్టికి తీవ్ర న‌ష్టాలు ఎదుర్కోక త‌ప్ప‌లేద‌ని మీడియాలు క‌థ‌నాల్ని వెలువ‌రించాయి.
Tags:    

Similar News