46లో కూడా డ్యాన్స్ తో మతిపోగొట్టేసింది!

Update: 2022-05-29 16:30 GMT
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకున్న శిల్పాశెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాలు తగ్గినా కూడా ఆమెకు క్రేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అంతేకాకుండా పలు రియాలిటీ షోలతో కూడా ఈ బ్యూటీ మంచి ఆదాయాన్ని కూడా సొంతం చేసుకుంటోంది. ఆ మధ్య కాలంలో తన భర్త కారణంగా కొంత అప్సెట్ అయిన శిల్పా శెట్టి పలు కేసుల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.

అయితే ఆమె ప్రస్తుతం మళ్ళీ తన సినిమా కెరీర్ ను ముందుకు సాగిస్తూ జనాల్లో మంచి క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక శిల్పా శెట్టి ఐదు పదుల వయస్సు దగ్గర పడుతున్న కూడా ఏమాత్రం చెక్కుచెదరని అందంతో కుర్రాళ్ల మతి పోగొట్టేస్తోంది అనే చెప్పాలి.

ఈ బ్యూటీ ఇటీవల పోస్ట్ చేసిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శిల్పాశెట్టి ఇటీవల బాలీవుడ్లో నికమ్మ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఎంసీఏ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన  విషయం తెలిసిందే.

తెలుగులో భూమిక నటించిన పాత్రలో ఇప్పుడు హిందీలో శిల్పా శెట్టి కనిపించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా శిల్పాశెట్టి హైలెట్ అయ్యే ప్రయత్నం కూడా చేస్తోంది.

రీసెంట్ గా ఈ సినిమాలోని ఒక ప్రత్యేకమైన పాటలో కూడా ఆమె కనిపించిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సాంగ్ మేకింగ్ వీడియోలో ఆమె ఒకవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరొకవైపు గ్లామర్తో కూడా ఎంతగానో ఆకర్షించింది.

శిల్పాశెట్టి అందానికి ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే అంటూ ఫాలోవర్స్ కూడా చాలా పాజిటివ్ స్పందిస్తున్నారు. ఆమెకు పోటీగా యంగ్ హీరోయిన్ ఉన్నప్పటికీ శిల్పాశెట్టి మాత్రం అస్సలు తక్కువగా కనిపించడం లేదు అని 46 ఏళ్ల వయసులో కూడా ఆమె పదహారేళ్ల అమ్మాయిలానే ఆకర్షిస్తుంది అని కూడా చెబుతున్నారు. మరి ఈ సినిమాతో ఈ బ్యూటీ ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.


Full View
Tags:    

Similar News