ఇన్ స్టాలో శిల్పా శెట్టి రీలోడెడ్ !

Update: 2021-10-25 15:30 GMT
శిల్పా శెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో విచార‌ణ ఎద‌ర్కోవ‌డం..అరెస్ట్ అవ్వ‌డంతో శిల్పాశెట్టి బ్రాండ్ ఇమేజ్ ఒక్క‌సారిగా ప‌డిపోయిన సంగ‌తి తెలిసిందే. స‌మాజంలో  పేరున్న వ్య‌క్తి  ఇలాంటి ప‌నుల‌కు పాల్ప‌డ‌త‌డా? అంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఆయ‌న సంగ‌తి ప‌క్క‌న‌బెడితే హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శిల్పాశెట్టి కెరీర్ పై  ఆ ఎఫెక్ట్  ప‌డింది. భ‌ర్త‌ను కేసు నుంచి త‌ప్పించాలని ఆమె ప్ర‌య‌త్నాలు చేయ‌డం..త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందో తెలుసుకునే ప్ర‌య‌త్నంలో శిల్పాశెట్టి ఇమేజ్ కి కూడా డ్యామేజ్ జ‌రిగింది. దీంతో ఆమెకున్న ఫాలోయింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది.

ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న క్రేజ్ అంతా రాత్రికి రాత్రే కుప్ప‌కూలిన‌ట్లు అయింది.  ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా ల‌క్షల‌ మంది ఫాలోవ‌ర్స్ క‌ల్గిన శిల్పాశెట్టి అభిమానులు ఒక్క‌సారిగా వ్య‌తిరేక ప‌వ‌నాల‌తో విరుచుకుప‌డ్డారు. నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శిల్ప ఆ దెబ్బ‌కి ఇన్ స్టాకి దూర‌మైంది. కొన్ని రోజుల పాటు ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వ‌కుండా సైలెంట్ గా ఉండిపోయింది. దీంతో ఇన్ స్టా రేసులో శిల్ప వెనుక‌బ‌డింది. ఇటీవ‌లే భ‌ర్త బెయిల్ పై రావ‌డంతో శిల్పాశెట్టి కుదుట‌ప‌డుతున్నారు. మ‌ళ్లీ ఇన్ స్టాలో యాక్టివ్ అయ్యే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. కొత్త ఫోటోల‌తో ఫాలోవ‌ర్స్ ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.

ప్ర‌స్తుతం ఇన్ స్టా గ్రామ్ సెల‌బ్రిటీల పాలిట ఓ బిజినెస్ యాప్ లో మారిపోయింది. ఫాలోయింగ్..క్రేజ్ ని పెంచుకుని ఎన్ క్యాష్ చేసుకుంటున్నారు. కొంద‌రు దీన్ని ప‌ద్ద‌తిగా వాడితే మ‌రికొంత మంది బిజినెస్ ప‌ర్ప‌స్ లో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల‌కు ఇది మంచి వేదిక‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఇన్ స్టాలో గ‌త వైభ‌వాన్ని అందుకోవాల‌ని శిల్పాశెట్టి మ‌ళ్లీ ఫాలోవ‌ర్స్ ని పెంచుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్లు కనిపిస్తోంది.  ప్ర‌స్తుతం శిల్పాశెట్టి ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ 22.8 మిలియ‌న్లు ఉన్నారు.  
Tags:    

Similar News