ఆదాయం పెంచుకునేందుకు శిల్పాశెట్టి సంచలన నిర్ణయం:

Update: 2021-08-19 05:55 GMT
ఒకప్పటి స్టార్ నటి శిల్పాశెట్టి సినిమాల్లో అప్పట్లో ఊపు ఊపేసింది.. బక్కచిక్కిన నడుముతో ఆమె నటన సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులోనూ ‘సాహసవీరుడు-సాగరకన్య’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది. శిల్పాశెట్టి పెళ్లి చేసుకున్న తరువాత కొన్నాళ్లు ఫ్యామిలీకే పరిమితమైంది. ఆ తరువాత టీవీ షోల్లో కనిపించి ఆకట్టుకుంది. మరోవైపు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజ్ ఫ్రాంచైజీగా ఉంటూ అలరిస్తోంది. ఇక ఈ మధ్య శిల్పశెట్టి భర్త కారణంగా వార్తల్లోకెక్కిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె భర్త అశ్లీల వీడియోల కేసు కారణంగా శిల్పా శెట్టి పేరు మీడియాలో మారుమోగుతోంది.

ఫోర్న్ వీడియోల కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టయిన విషయం తెలిసింది. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. రోజుకో నటి ఈ కేసుపై మాట్లాడడం సంచలనంగా మారుతోంది. అయితే రాజ్ కుంద్రా సతీమణి, నటి శిల్పాశెట్టి మాత్రం తన భర్త అక్రమాలకు పాల్పడలేదని ఆ మధ్య కన్నీరు కారుస్తూ చెప్పింది. కేవలం గ్లామరస్ సినిమాలు మాత్రమే చేశారని, ఎవరో తన భర్తను ఈ కేసులో ఇరికించారని ఆవేదన చెందింది. మరోవైపు తన పిల్లలకు ప్రైవసీ కల్పించాలని కోరింది. దీంతో కొందరు శిల్పా శెట్టి కి తెలియకుండా ఈ వ్యవహారం జరుగుతుందా..? అని ప్రశ్నించారు. కానీ శిల్పా శెట్టి మాత్రం అలాగే అంటూ వస్తోంది.

తాజాగా శిల్పాశెట్టి రీ ఎంట్రీ ఇచ్చింది. తాను ఒకప్పుడు టీవీ షోల్లో జడ్జిగా ఉన్న పోస్టుకే మళ్లీ వచ్చింది. ఓ ఛానెల్లో ప్రసారమవుతున్నా ‘సూపర్ డాన్సర్-4’కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సినిమాల్లో కనిపించడం మానేసిన తరువాత బుల్లితెరకు పరిమితమైన శిల్పాశెట్టి ఈ డ్యాన్స్ షో తో మరింత పాపులర్ సాధించారు. ఈ షో ట్రెండ్ అవడానికి శిల్పాశెట్టి పాత్ర కూడా ఉంది. దీంతో షో నిర్వాహకులు శిల్పాశెట్టి పోస్టును అలాగే ఉంచారు. భర్త వ్యవహారం బయటపడినా ఆమెకు మాత్రం జడ్జిగా అవకాశం ఇచ్చారు. దీంతో శిల్పాశెట్టి ఈ డ్యాన్స్ షోలో రెగ్యులర్ గా కనిపించనుంది.

ఇక షో లో ప్రత్యక్షమైన శిల్పాశెట్టి ముందుగా ఎమోషనల్ గా ఫీలయ్యారు. తన భర్త వ్యవహారంతో తన కెరీర్ క్లోజ్ అయిందని, ఇక శిల్పాశెట్టి ఇంటికే పరిమితం అవుతారని ప్రచారం జరిగింది. దీంతో అందులో ఎలాంటి నిజం లేదని శిల్పాశెట్టి రావడంతో తేలింది. శిల్పాశెట్టి సెట్సోలో అడుగుపెట్టిన వీడియో వైరల్ కావడంతో ఇక ఆమె డ్యాన్స్ షోకు జడ్జిగా కొనసాగుతారని క్లారిటీ వచ్చింది.

శిల్పాశెట్టి సూపర్ డ్యాన్స్ -4కు రీ ఎంట్రీ ఇచ్చినా అదే రెమ్యూనరేషన్ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. తన భర్త వివాదంలో ఇరుక్కున్న తరువాత ఆమె ఈ షో నిర్వాహకులను ఎప్పటికప్పుడు సంప్రదించారట. అయితే మధ్యలో శిల్పాశెట్టి స్థానంలో మరో ఇద్దరి స్టార్ నటీమణులను ప్రత్యేకంగా పిలవడంతో శిల్పాశెట్టి ఇక ఈ షోకు రాదని అనుకున్నారు. కానీ ఆమె సెట్సోలోకి వచ్చిన వీడియోతో ఇక శిల్పాశెట్టి స్థానం అమెకే ఉంటుందని తెలిసిపోయింది. మరోవైపు ఆమె రెమ్యూనరేషన్ కూడా యధావిధిగానే ఉంటుందని నిర్వాహకులు చెప్పారట.

ఇప్పటికే శిల్పాశెట్టి వివాదంలో ఉన్నందున ఈ షో ఎలాంటి వివాదం లేకుండా సాగాలని నిర్ణయించారు. గతంలో పలు రియాలిటీ షో ల్లో పాల్గొన్న శిల్పాశెట్టి ఎలాంటి వివాదాల్లోచిక్కుకోలేదు. ఇప్పుడు భర్త వ్యవహారంలో ఆమెపై కూడా పలు ఆరోపణలు రావడంతో ఆ విషయానికి సంబంధించి ఈ షోలో రాకుండా ఉండేందుకు జాగ్రత్తపడుతున్నారు. మొత్తంగా శిల్పాశెట్టి వివాదంలో ఉన్నా ఆదాయాన్ని పెంచుకునేందుకు తిరిగి టీవీ షోకు రావడం ఆసక్తిగా మారింది.




Tags:    

Similar News