పార్టీ రెమో కోసమా.. ఇమేజ్ కోసమా?

Update: 2016-11-03 05:02 GMT
టాలీవుడ్ లో పాగా వేసేందుకు.. ఇక్కడి ఆడియన్స్ మనసు దోచుకునేందుకు ఇతర భాషల హీరోలు కూడా తెగ ప్రయత్నించేస్తూ ఉంటారు. మన జనాలు కూడా ఓ పట్టాన వేరేవారిని ఒప్పుకోరు కానీ.. సినిమా నచ్చి ఓ సారి యాక్సెప్ట్ చేశారంటే మాత్రం వదిలిపెట్టరు. తాజాగా బిచ్చగాడు సక్సెస్ చూస్తే ఈ విషయం తెలుస్తుంది. అందుకే తన కెరీర్ లో బెస్ట్ మూవీ అయిన రెమోతో.. ఇదే రేంజ్ లో ప్రయత్నం చేసేస్తున్నాడు శివ కార్తికేయన్.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో.. శివ కార్తికేయన్ లేడీ గెటప్ లో కనిపించడమే ప్రధాన ఆకర్షణ. ఏ లాంగ్వేజ్ ఆడియన్స్ ను అయినా ఆకట్టుకునే సబ్జెక్ట్ కావడం.. తెలుగోళ్లకు తెలిసిన అమ్మాయి అయిన కీర్తి సురేష్ హీరోయిన్ గా ఉండడంతో.. రెమో తో తనను తాను తెలుగులో లాంఛ్ చేసుకునేందుకు డిసైడ్ అయిన ఈ హీరో.. బోలెడంత ఖర్చు పెట్టేస్తున్నాడట కూడా. రీసెంట్ గా మీడియా జనాలకు ఇచ్చిన పార్టీ కోసమే లక్షల్లో బిల్లు కట్టాడంటే శివ కార్తికేయన్ ట్రయల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధమవుతుంది.

కమెడియన్ నుంచి టీవీ స్టార్.. అక్కడి నుంచి సింగర్.. ఆ తర్వాత హీరో మారి ఇప్పుడు స్టార్ స్టేటస్ వైపు పరుగులు పెడుతున్న శివకార్తికేయన్.. రెమో తెలుగు వెర్షన్ కోసం అంతా తానై వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. నిర్మాతగా దిల్ రాజు పేరు ఉన్నా.. తెర వెనక అంతా ఇతని ఖర్చే అంటున్నారు. మీడియా ఈ రేంజులో పార్టీ ఇచ్చాడంటే.. కాస్త లాంగ్ రన్ కోరుకుంటున్నాడు శివ. రెమో కోసం అయినా కాకపోయినా.. టాలీవుడ్ లో పాతుకుపోవడానికి.. గట్టిగానే ఫిక్స్ అయ్యాడు అని అనుకోవచ్చులే. కాకపోతే హిట్లు కొడితేనే ఇక్కడ పనవుద్ది బ్రదర్.. పార్టీలదేముంది!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News