చైతన్య- సమంత జంటగా శివ నిర్వాణ తెరకెక్కించిన `మజిలీ` ఈ నెల 5న రిలీజవుతోంది. `నిన్ను కోరి` లాంటి సెన్సిబుల్ సినిమాని తెరకెక్కించిన శివ మరోసారి అలాంటి సెన్సిబిలిటీస్ ని టచ్ చేస్తూ సినిమా తీశాడని ట్రైలర్ చెబుతోంది. సబ్బవరం (వైజాగ్) వాసి శివ నిర్వాణ తాజాగా హైదరాబాద్ మీడియాతో ముచ్చటించారు.
అసలు ఈ చిత్రానికి మజిలీ అనే టైటిల్ పెట్టడానికి కారణం చెబుతూ... మన సుదూర ప్రయాణంలో మధ్యలో సేద తీరే పాయింట్‌ని మజిలీ అని అంటాం. లైఫ్ లో పరుగెడుతున్న ఒక మనిషి ని ఆపి - గైడ్ చేసి కొంత సేదతీర్చే పాయింట్ పెళ్లి. అదే కాన్సెప్టుతో ఈ టైటిల్ ఎంపిక చేసుకున్నాను అని తెలిపారు. నిన్నుకోరి - మజిలీ రెండు క్లాస్ సినిమాలే కదా? అని ప్రశ్నిస్తే.. నిన్నుకోరి సినిమా క్లాస్. కానీ మజిలీ లో మాస్ కూడా ఉంటుంది. ట్రైలర్ చూస్తే ఇప్పటికే మీకు అర్ధం అయి ఉంటుంది. సినిమా చూస్తే పూర్తిగా అర్దం అవుతుందని తెలిపారు. రెండూ లవ్ ఫెయిల్యూర్ గురించే కదా! మీ నిజజీవితంలోనూ అలాంటి అనుభవాలున్నాయా? అని ప్రశ్నిస్తే.. అలాంటిదేమి లేదని అన్నారు. కాలేజ్ రోజుల్లో చిన్న చిన్న క్రష్‌లు తప్ప నిన్నుకోరి - మజిలీ లాంటి లవ్ ఫెయిల్యూర్స్ లేనే లేవు. కానీ నా స్నేహితుల విషయంలో జరిగిన ఘటనలను దగ్గరినుండి చూసి వాటినే పాత్రలుగా రాసుకున్నా.. అని తెలిపారు.
సామ్ - చై పెర్ఫామెన్స్ గురించి మాట్లాడుతూ.. సామ్ ఎప్పుడూ బాగా చేస్తుంది. అయితే ఈ సినిమాలో చైతు అద్భుతంగా చేశారు. సమంత గతంలోనూ.. ఇప్పుడు ఎప్పుడూ బాగానే చేస్తారు. కానీ చైతన్య ఎంత అద్భుతంగా నటించగలడో ఈ సినిమాతోనే అందరికీ తెలుస్తుంది. చై అంత ప్రభావితం చేస్తాడని అన్నారు. మజిలీ కథతో వైజాగ్ లింక్? గురించి చెబుతూ.. నేను నా రెండు స్టోరీలు వైజాగ్ లోనే రాశాను. మాది సబ్బవరం .. వైజాగ్ నుండి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడే వైజాగ్ హోటల్లో స్నేహితులతో కలిసి కథలు రాస్తాను. లవ్ స్టోరీకి బీచ్ నేపథ్యం ఉంటే బాగుంటుంది అని అక్కడే కొంత భాగం చిత్రీకరించాం. అందుకే ఈ సినిమాలో...“వైజాగ్ లో పెళ్ళాలు మొగుళ్లని మాయ్యా అని పిలుస్తారు” అనే డైలాగ్ కూడా ఉపయోగించేశామని తెలిపారు. తదుపరి రెండు కథలు ఉన్నాయి. ఒకటి పూర్తి కామెడీ కథాంశం, మరొకటి పూర్తి యాక్షన్ థ్రిల్లర్ తరహా అని వెల్లడించారు.