నిన్నవెలువడిన ఎన్నికల ఫలితాల్లో నాగబాబు ఓడిపోయాడు. సరే జనసేన పార్టీ అద్యక్షుడు పవన్ కల్యాణే ఓడిపోగా లేనిది నాగబాబు ఓటమి పెద్ద విషయమా అని మీడియా సంస్థలు లైట్ తీసుకున్నాయి కానీ దాని వెనుక ఓ ఆసక్తికరమైన విశ్లేషణ ఇప్పుడు పొలిటికల్ సినిమా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం మా మాజీ ప్రెసిడెంట్ శివాజీరాజా ఎంతో కొంత నాగబాబు ఇమేజ్ ని డ్యామేజ్ చేశాడని సారాంశం.
మా ఎన్నికలు జరుగుతున్న సమయంలో సీనియర్ నరేష్ రాజశేఖర్ దంపతుల వైపు స్టాండ్ తీసుకున్న నాగబాబు చాలా స్పష్టంగా శివాజీరాజాను టార్గెట్ చేసి ఆయన తీరుని ఎండగట్టారు. దీనికి బదులుగా శివాజీరాజా త్వరలో రిటర్న్ గిఫ్ట్ అందుతుందని రిటార్ట్ ఇచ్చాడు. సరే ఇదంతా మాములే అని జనం లైట్ తీసుకున్నారు
కట్ చేస్తే శివాజీరాజా నాగబాబు నరసాపురం నుంచి పోటీ చేయడం గురించి ప్రచారంలో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పైసా ఖర్చు పెట్టని నాగబాబు మా సంఘం అభివృద్ధిని రెండేళ్ళు వెనక్కు తీసుకెళ్ళిన మనిషి ఇంత పెద్ద ఊరికి ఏదో చేస్తాడని ఎలా నమ్ముతారని కాస్త గట్టిగానే స్వరం వినిపించాడు. స్వతహాగా అది శివాజీరాజ స్వస్థలం కావడంతో అతని మాటకు వెయిట్ వచ్చింది.
జనం నమ్మి డైవర్షన్ తీసుకున్న వాళ్ళు లేకపోలేదని అక్కడి విశ్లేషకుల మాట. నిజంగా శివాజీరాజాకు ఓటర్లను ప్రభావితం చేసే సీన్ ఉందో లేదో కాని ఇప్పుడీ చర్చ జోరుగా సాగుతోంది. పవన్ గెలిచి నాగబాబు ఓడిపోయి ఉంటే ఇది హై లైట్ అయ్యేది కాని అది జరగలేదు కాబట్టి దీనికి అట్టే ప్రాధాన్యత లేకుండా పోయింది. అందుకే నాగబాబు ప్రస్తావన ఎక్కడా పెద్దగా వినిపించలేదు. ఇక జబర్దస్త్ జడ్జ్ గా కొనసాగడం కన్ఫర్మ్ అయినట్టే