తెలుగు తెరపై కథానాయికలుగా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దక్కడం కష్టమేననేది ఒకప్పటి మాటగా మారిపోతోంది. ఇటీవల కాలంలో తెలుగు అమ్మాయిలు తెలుగు తెరపై కుదురుకుంటున్నారు .. కెరియర్ పరమైన ఒడిదుడుకులను తట్టుకుని నిలదొక్కుకోగలుగుతున్నారు.
స్వాతి .. అంజలి .. ఆనంది తెలుగు తెరపై కథానాయికలుగా కాస్త ఎక్కువ దూరమే ప్రయాణం చేశారు. అయితే ఈ ముగ్గురూ కూడా తెలుగులో కంటే తమిళంలో బాగా పాప్యులర్ కావడం విశేషం. ఈషా రెబ్బా కూడా అచ్చమైన తెలుగు అందమే.
కాకపోతే తమిళం వైపు వెళ్లకుండా ఇక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకుని నిలదొక్కుకుంది. మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తూనే, వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ వెళ్లింది. వెబ్ సిరీస్ లతో కూడా ఈ బ్యూటీ బిజీగానే ఉంది.
సినిమాల్లో ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు పడుతూ ఉండటంతో, కెరియర్ పరంగా తన జోరును పెంచడానికి రెడీ అవుతోంది. పెద్ద బ్యానర్లల్లో .. పెద్ద హీరోల సినిమాలలో ఆమె పేరు వినిపిస్తోంది.. కనిపిస్తోంది. ఈ జాబితాలోనే చేరిన మరో తెలుగు అమ్మాయిగా శోభిత ధూళిపాళ పేరు వినిపిస్తోంది.
శోభిత ధూళిపాళ 'తెనాలి' అమ్మాయి. నటిగా ఆమె కెరియర్ బాలీవుడ్ సినిమాలతోనే మొదలైంది. తొలి సినిమా అయిన 'రామన్ రాఘవ్ 2.0' తోనే ఆమె సక్సెస్ ను అందుకుంది. ఆ వెంటనే పెద్దగా గ్యాప్ లేకుండానే తెలుగు .. మలయాళ సినిమాలకు పరిచయమైంది. తెలుగులో చేసిన 'గూఢచారి' సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంది.
అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. అడివి శేష్ తాజా చిత్రమైన 'మేజర్'లోను ఆమె ఛాన్స్ కొట్టేసింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. ఫిబ్రవరి 11వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
ఇక తాజాగా ఆమె మలయాళంలో చేసిన 'కురుప్' కూడా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులో ఈ సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకు కారణం టైటిల్ మైనస్ కావడమేనని చెప్పుకోవచ్చు. ఇక ప్రమోషన్లు పెద్ద స్థాయిలో లేకపోవడం వలన కూడా కావొచ్చు.
కానీ మలయాళంలో మాత్రం ఈ సినిమా హిట్ అయింది. అక్కడ దుల్కర్ స్టార్ హీరో కావడం ఆ సినిమా విజయానికి కలిసొచ్చి ఉంటుంది. అలా వరుస హిట్లు కొడుతూ వెళుతున్న శోభిత ధూళిపాళ, త్వరలో మణిరత్నం సినిమా అయిన 'పొన్నియిన్ సెల్వన్'తో పలకరించనుంది. ఈ సినిమాతో ఈ తెలుగమ్మాయ్ తమిళంలోను బిజీ అవుతుందేమో చూడాలి.