సల్మాన్ హత్యకు కుట్ర.. సిద్దూ మర్డర్ కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచిన సంగతి తెలిసిందే. పంజాబ్ లో హత్యకు గురైన సింగర్ సిద్దూ మూసేవాలాకు పట్టిన గతే కండల వీరుడికి పడుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖ పంపడంతో సల్మాన్ కు భద్రతను కట్టుదిట్టం చేశారు. సల్మాన్ ప్రస్తుతం హైదరాబాద్ లో టైట్ సెక్యూరిటీ మధ్య తన తదుపరి చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే సల్మాన్ ఓ షార్ప్ షూటర్ చేతిలో దాదాపు హతమయ్యే పరిస్థితి నుంచి బయటపడ్డాడని ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
సిద్ధూ మూస్‌వాలా హత్యపై విచారణ జరుగుతున్న తరుణంలో సల్మాన్ ఖాన్ ను చంపడానికి ప్లాన్ చేసిన విషయం వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చాలా కాలం క్రితం సల్మాన్ ను అతని నివాసం లోపలే చంపడానికి ప్రయత్నించగా.. చివరి నిమిషంలో ప్లాన్ రద్దు చేయబడింది. సిద్దూ హత్య కేసులో అనుమానితుడు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయే.. బాలీవుడ్ స్టార్ హీరో హత్యకు ప్రణాళిక రచించాడని తెలుస్తోంది.
ప్రస్తుతం సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఇందులో లారెన్స్ బిష్ణోయ్ అనుచరులు పట్టుబడినట్లు తెలుస్తోంది. అయితే లారెన్స్ బిష్ణోయ్ మనుషులు సల్మాన్ ఖాన్ ను చంపడానికి అతని నివాసం వెలుపల రెక్సీ నిర్వహించారట. సల్లూ భాయ్ ఉదయాన్నే సైక్లింగ్ కు బయటకు వెళ్లేటప్పుడు సెక్యూరిటీ గార్డులు అతనితో ఉండరనే విషయాన్ని నిర్ధారించుకున్నారట. ఆ సమయంలో చంపడం ఈజీ అవుతుందని.. తదనుగుణంగా సల్మాన్ ను అంతమొందించడానికి ఒక పథకం రచించారు.
అయితే షార్ప్ షూటర్ తమ ప్లాన్ ను అమలు చేయబోతున్నప్పుడు.. ఆరోజు సల్మాన్ ఖాన్ తన నివాసం నుండి బయలుదేరబోతున్నప్పుడు ముంబై పోలీసుల ఎస్కార్ట్ అతని గేట్ వద్ద ఉంది. ఇది షార్ప్ షూటర్ మరియు అతని సహచరులను కలవరపెట్టింది. హత్యకు ఇది సరైన సమయం కాదని.. పోలీసులకు పట్టుబడతారేమోనని భయపడి మర్డర్ ప్లాన్ ను విరమించుకున్నారని తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్ హత్యకు ప్లాన్ చేయడం ఇదేం తొలిసారి కాదు. 2018లోనూ ఇదే గ్యాంగ్ కి చెందిన సంపత్ నెహ్రా అనే షూటర్.. సల్మాన్ ని మర్డర్ చేసేందుకు కుట్రపన్నడమే కాకుండా రెక్కీ కూడా పూర్తి చేశాడు. కానీ అనుకోకుండా సంపత్ నెహ్రా అరెస్ట్ అవడంతో అతడి ప్లాన్ వర్కౌట్ కాలేదు. కృష్ణ జింక వేట కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ గతంలో లారెన్స్ బిష్ణోయ్ కోర్టు ఆవరణలోనే బెదిరించాడు. ఈ క్రమంలో అనేకసార్లు హత్యకు ప్లాన్ చేసి విఫలమయ్యారు.
ఇక కరోనా లాక్ డౌన్ కు ముందు ఓ షార్ప్ షూటర్ ముంబైలోని బాంద్రాలో సల్మాన్ ఉంటున్న గెలాక్సీ అపార్టుమెంట్ వద్ద రెక్కీ నిర్వహించినట్టు అంగీకరించాడని పోలీసులు వెల్లడించినట్టు జూమ్ ప్రచురించిన ఓ కథనం పేర్కొంది. హత్యకు కుట్ర పన్నిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కి చెందిన షూటర్ ని హర్యానాలోని ఫరిదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఓ వ్యక్తి హత్య కేసులో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సమయంలోనే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్రపన్నిన కోణం బయటపడిందని పేర్కొన్నారు. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ స్టార్ హత్య పథకం రచించిన విషయం బయట పడింది.