ఖుష్బూ సుందర్ .. పరిచయం అవసరం లేని పేరు ఇది. మొన్న మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో జరిగిన క్లాష్ ఆఫ్ ఎయిటీస్ పార్టీలో స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన ఖుష్బూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అప్పటికి ఖుష్బూ లుక్ వేరు.. ఆ తర్వాత లుక్ వేరు. ఎవరూ ఊహించనంత మార్పు కనిపించింది. అయితే ఇంత స్వల్ప వ్యవథిలో అంత మార్పు ఎలా సాధ్యమైంది? అన్నది ఆరా తీస్తే ఓ ఆసక్తికర విషయం బయటపడింది.
సహజంగానే బొద్దుగా ఉండే సెలబ్రిటీలకు సోషల్ మీడియాల్లో ట్రోల్స్ ఎదురవుతుంటాయి. ఆ తరహాలోనే ఇంతకుముందు ఖుష్బూ కుమార్తె ఆనందిత ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే తన కుమార్తెపై కామెంట్లు చేసిన నెటిజనులకు ఖుష్బూ అంతే ధీటుగా కౌంటర్లు వేశారు. ఇక ఖుష్బూ కి అవంతిక - ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ట్రోలింగ్ తో హర్ట్ అయిన ఆనందిత ఎంతో పట్టుదలగా తన రూపం మార్చుకునేందుకు శ్రమించింది. ఇటీవల ఆనందిత రూపంలో అనూహ్యమైన మార్పు కనిపించింది.
ఇక ఆనందిత స్ఫూర్తితోనే ఖుష్బూ సైతం ఈ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారని తాజా లుక్ చూస్తే అర్థమవుతోంది. మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం .. జిమ్ అవసరం ఏమిటో ఖుష్బూ ఇదివరకూ చాలా సందర్భాల్లో తెలిపారు. ఎంతో క్రమశిక్షణ పట్టుదలతో అనుకున్నది సాధించారు. ఎయిటీస్ స్టార్స్ అంతా షాక్ తినే రేంజులోనే ఈ ఛేంజోవర్ సాధ్యమైంది. ఖుష్బూ స్ఫూర్తితో యువతరం ట్రై చేస్తుందేమో.