విలక్షణమైన నటనతో తెలుగు, తమిళ భాషల్లో హీరోగా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నవెర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు విక్రమ్ ను చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అయితే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని, ఆయన బాగున్నారని కుటుంబ సభ్యులు, హాస్పిటల్ సిబ్బంది తెలిపారు.
కోలీవుడ్ మీడియా తాజా వార్తల ప్రకారం విక్రమ్ ఆరోగ్యం నిలకడగా వుందని తెలిసింది. అయితే విక్రమ్ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త తెలియడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అభిమాన హీరో విక్రమ్ తిరిగి క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'బంగారు కుటుంబ', చిరునవ్వుల వరమిస్తావా వంటి చిత్రాల్లో నటించిన విక్రమ్ ఆ తరువాత తమిళ తెరకు వెళ్లిపోయారు.
అయితే సూర్యతో కలిసి నటించిన 'శివ పుత్రుడు (పితామగన్)', శంకర్ తెరకెక్కించిన 'అపరి చితుడు' సినిమాలు తెలుగులో హీరోగా విక్రమ్ కు మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. ఈ చిత్రాల తరువాత తెలుగులో విక్రమ్ కు మంచి మార్కెట్ తో పాటు భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ లభించడం మొదలైంది. 'అపరిచితుడు' చిత్రంతో విక్రమ్ స్టార్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు.
గత కొంత కాలంగా హీరోగా ఫామ్ ని కోల్పోయిన విక్రమ్ ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందులో ఒకటి ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న 'పొన్నియిన్ సెల్వం' ఒకటి.
మరొకటి జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న 'కోబ్రా'. ఈ మూవీలో విక్రమ్ దాదాపు 11 గెటప్ లలో కనిపించబోతున్నాడు. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలున్నాయి. ఇవి రెండు కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానున్నాయి.
మణిరత్నం తెరకెక్కిస్తున్న 'పొన్నియిన్ సెల్వం' పార్ట్ 1 టీజర్ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు చెన్నైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిలీజ్ కానుంది. ఈ భారీ ఈవెంట్ కోసం అంతా రెడీ అవుతున్న వేళ విక్రమ్ హార్ట్ ఎటాక్‌కు లోను కావడం అభిమానుల్ని కలవరానికి గురిచేసింది. దీంతో అభిమానులు విక్రమ్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే విక్రమ్ ని పరీక్షించిన వైద్యులు ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రకటించడంతో అభిమానులతో పాటు ఫిల్మ్ సెలబ్రిటీలు ఊపిరి పీల్చుకున్నారు.