హిట్టు, ఫట్టు.. మధ్యలో బోల్డు

Update: 2016-03-05 13:30 GMT
ఈ వారం కూడా టాలీవుడ్ లో చిన్న చిత్రాల హవా కనిపించింది. కొన్ని డబ్బింగ్ సినిమాలతో పాటు మూడు స్ట్రయిట్ మూవీస్ కూడా బరిలోకి దిగాయి. ఈ మూవీస్ అన్నిటి మీద రిలీజ్ కి ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి ప్రధాన కారణం ఈ మూడు చిత్రాల దర్శకులపై ఉన్న మంచి అభిప్రాయాలే. మొదటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కళ్యాణ వైభోగమే మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సునిశితమైన రొమాంటిక్ కామెడీకి ఆఢియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలా మొదలైంది డైరెక్టర్ నుంచి మరో మంచి మూవీ అనే ప్రశంసలు వస్తున్నాయి.  

పలు భారీ బడ్డెట్ సినిమాలను కూడా తీసిన దర్శకుడు దశరథ్ డైరక్షన్ లో మంచు మనోజ్ హీరోగా వచ్చిన మూవీ శౌర్య. అన్ని సినిమాల్లోకి భారీ ఎత్తున విడుదల చేయడంతో శౌర్యకే ఓపెనింగుల అడ్వాంటేజ్ ఉంటుందని అందరూ భావించారు. కానీ థ్రిల్లర్ ని సరిగా డీల్ చేయకపోవడం, రెండు గంటల సినిమాలో కూడా లాగ్స్ ఎక్కువగా ఉండడం, మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవడం, రివ్యూలు కూడా నెగిటివ్ గా ఉండడంతో.. ఆశించిన స్థాయి సాధించలేకపోయాడు శౌర్య. కనీసం పెట్టుబడులను కూడా రాబట్టుకోవడం కష్టమే అని తేల్చేస్తున్నారు.

ఇక నేషనల్ అవార్డ్  విన్నర్ అయిన ప్రవీణ్ సత్తారు.. ఓ బీ గ్రేడ్ మూవీతో ఆడియన్స్ కే కాదు.. ఇండస్ట్రీకి కూడా షాక్ ఇచ్చాడు. కానీ ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఉద్దేశ్యపూర్వకంగానే చేసిన ప్రయత్నం కాబట్టి.. ఈ బోల్డ్ మూవీ కొందరు టార్గెటెడ్ ఆడియన్స్ వరకూ ఎక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలా ఓ హిట్టు, ఓ ఫట్టు.. మధ్యలో బోల్డ్ మూవీతో టాలీవుడ్ ఈ వారం గడిపేస్తోంది.
Tags:    

Similar News