బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తికి నేడు(బుధవారం) ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో సెప్టెంబర్ 4న షోవిక్ ను.. సెప్టెంబర్ 8న రియాని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. రియా మరియు సోవిక్ లకు డ్రగ్ ప్లెడర్ లతో సంబంధాలు ఉన్నాయని.. సుశాంత్ కు డ్రగ్ కూడా సప్లై చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని ఎన్‌సీబీ అధికారులు వెల్లడించడంతో వారిని జైలుకు తరలించారు. నెల రోజుల కస్టడీ తర్వాత రియా కి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అక్టోబర్ లో ఆమెను రిలీజ్ చేశారు. కానీ షోవిక్ చక్రవర్తి బెయిల్ పిటిషన్ ని తిరస్కరించారు. ఈ క్రమంలో అరెస్టు అయిన మూడు నెలల తర్వాత రియా సోదరుడికి షరతులతో బెయిల్ దక్కింది.
కాగా, జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రా నివాసంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ దర్యాప్తులో భాగంగా డ్రగ్స్ కోణం వెలుగు చూసింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో పలువురి అరెస్ట్ చేయడంతో పాటు చాలా మంది సినీ ప్రముఖులను విచారించారు. ఈ విచారణలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లు దీపికా పదుకొనె - శ్రద్దా కపూర్ - అలియా భట్ - రకుల్ ప్రీత్ సింగ్ లను కూడా ఎన్‌సీబీ ప్రశ్నించింది.